news18-telugu
Updated: July 15, 2020, 4:15 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా కోవిడ్-19 నివేదిక మేరకు...గత 24 గంటల్లో ఏకంగా 44 మంది మరణించారు. కోవిడ్-19 కారణంగా ఒక రోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇదే. నిన్నటి నివేదికలో 43 మంది మృతి చెందినట్లు వెల్లడించగా...గత మూడు రోజుల వ్యవధిలోనే ఏకంగా 120 మంది కరోనా కాటుకు బలికావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా... 22,197 శాంపిల్స్‌ని టెస్ట్ చెయ్యగా... 2412 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35451కి చేరింది. గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి 9, కర్నూలు 5, చిత్తూరు 4, తూర్పు గోదావరి 4, విశాఖపట్నం 4, కడప 2, కృష్ణా 2, ప్రకాశం 2, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా చనిపోయారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 452కు చేరింది.
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 805 మంది కోలుకున్నారు. దీంతో ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16032కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16091 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 1217963 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
July 15, 2020, 4:01 PM IST