Covid Vaccination: డిసెంబ‌ర్ క‌ల్లా 43శాతం వ్యాక్సినేష‌న్ : కేంద్ర ఆరోగ్య‌శాఖ‌

covid 19 vaccination

దేశంలో టీకా పంపిణీ జ‌న‌వ‌రి(January)లో ప్రారభమైందని.. ఇప్పటి వ‌ర‌కు 75 కోట్ల మందికి పైగా డోసుల అందించడం పూర్త‌య్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  వెల్లడించారు.  ఈ పంపిణీ ఇలాగే కొనసాగితే డిసెంబర్ కల్లా 43శాతం వ్యాక్సినేషన్(Vaccination) పూర్తవుతుందని ఆయన అన్నారు.

  • Share this:
    దేశంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ వేగంగా నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ(Mansukh Mandaviya) అన్నారు.  దేశంలో జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మైన టీకా కార్య‌క్ర‌మం అయ్యిందని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు 75 కోట్ల మందికి పైగా డోసుల పంపిణీ పూర్త‌య్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  వెల్లడించారు.  అన్ని విభాగాలు సమన్వయంతో ఇలానే  వేగంగా వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియను చేపడితే డిసెంబ‌ర్ నాటికి దేశ జ‌నాభాలో 43శాతం మందికి టీకాలు అందుతాయ‌ని ఆయన అంచనా వేశారు.  దేశం  75వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు నిర్వహించుకొంటున్న వేళ కోవిడ్ పోరులో భాగంగా.. 75 కోట్ల మైలు రాయిన చేరుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని మంత్రి పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా దేశంలో.. 75 కోట్ల‌కు ఊగా టీకా డోసులు పంపిణీ చేశామ‌ని ఆయ‌న ట్వ‌ట్ట‌ర్(Twitter) వేదిక‌గా ప్ర‌క‌టించారు.



    క‌రోనా థార్డ్ వేవ్ (Third Wave) ఎదుర్కోవాలంటే డిసెంబ‌ర్ నాటిక‌ల్లా 60శాతం దేశ జనాభాకు రెండు డోసులు అందాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో దేశంలో రోజుకు 1.2 కోట్ల టీకాలు వేయాల్సి ఉంటుంది. కేంద్రం ఏడాది చివ‌రి నాటికి 200 కోట్ల డోసులు పంపిణీ ల‌క్ష్యంగా అడుగులు ముంద‌కు వేస్తోంది.
    వారం రోజుల‌కు సగ‌టున 70 ల‌క్ష‌ల మందికి పైగా టీకాలు పంపిణీచేస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. మ‌రోవైపు దేశంలో 3.3 కోట్ల మందికి క‌రోనా సోక‌గా 4.4ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.

    Covid 19: అప్ప‌టి వ‌ర‌కు మాస్కులు ధ‌రించాలి : స్ప‌ష్టం చేసిన నీతి ఆయోగ్ స‌భ్యులు


    దేశంలో COVID-19 పరిస్థితి
    గతంతో పోలిస్తే కోవిడ్ 19 కేసుల సంఖ్య దేశ  వ్యాప్తంగా తక్కువగానే ఉంది.  ఇది సంతోషించాల్సిన అంశమే.. కానీ రాబోయేది పండగల సీజన్ కాబట్టి కేసులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని, జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

    పాజిటివిటీ రేటు :-
    - దేశంలో రోజువారి పాజిటివిటి(Positivity) రేటు 2.26 శాతంగా నమోదైంది.
    - గత 14 రోజులుగా ఇది మూడు శాతం కంటే తక్కువగా ఉందని, ఇప్పుడు వరుసగా 97 రోజులు ఐదు శాతం కంటే తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
    - వీక్లీ పాజిటివిటీ రేటు 2.11 శాతంగా నమోదైంది.
    - గత 80 రోజులుగా ఈ సంఖ్య మూడు శాతం కంటే తక్కువగా ఉంది.
    Published by:Sharath Chandra
    First published: