భారత్‌లో అరివీర భయంకరంగా కరోనా... భారీగా కొత్త కేసులు, మరణాలు...

ఇండియాలో కరోనా కంట్రోల్ తప్పిందనేందుకు రెండు వారాలుగా రోజూ నమోదవుతున్న కేసులు, మరణాలే చెబుతున్నాయి. తాజాగా లెక్కలు మరింత దారుణంగా ఉన్నాయి.

news18-telugu
Updated: June 28, 2020, 9:56 AM IST
భారత్‌లో అరివీర భయంకరంగా కరోనా... భారీగా కొత్త కేసులు, మరణాలు...
భారత్‌లో అరివీర భయంకరంగా కరోనా... భారీగా కొత్త కేసులు, మరణాలు...
  • Share this:
ఇండియాలో నిన్న ఒక్క రోజే 410 మంది కరోనాతో చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 16095కి పెరిగింది. ఒక్క రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. అంతేకాదు... నిన్న ఒక్క రోజే 19906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదివరకు ఎప్పుడూ ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్ కేసులు రాలేదు. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 528859కి పెరిగిపోయింది. ఇక డిశ్చార్జి అయినవారి సంఖ్య 309713గా ఉండగా... యాక్టివ్ కేసుల సంఖ్య 203051గా ఉంది. జూన్ 27న దేశవ్యాప్తంగా 231095 శాంపిల్ టెస్టులు చెయ్యడంతో... మొత్తం శాంపిల్ టెస్టుల సంఖ్య 8227802కి పెరిగింది.

మొత్తం అత్యధిక పాజిటివ్ కేసుల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత స్థానంలో భారత్ ఉంది. కొత్తగా రోజూ నమోదవుతున్న కేసుల్లో ఇండియా టాప్ 3లో ఉంది. అలాగే... రోజువారీ మరణాల్లో భారత్... టాప్ 4లో ఉండగా... మొత్తం మరణాల్లో ఇండియా... టాప్ 8లో ఉంది. ఈ లెక్కలన్నీ ఇండియాలో కరోనా అత్యంత తీవ్రంగా ఉందనే వాస్తవాన్ని బయటపెడుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా క్లోజింగ్ కేసుల్లో మరణాల శాతం 8గా ఉండగా... ఇండియాలో అది కాస్త్ తగ్గి... 3 శాతంగా ఉంది. ఇక రికవరీ రేటు కూడా మెరుగవుతూ... 58.6 శాతంగా ఉంది. ఈ రికవరీ కేసులు పెరుగుతున్న కొద్దీ దేశంలో కరోనా జోరు తగ్గుతోందని అనుకోవచ్చు. ఓవరాల్‌గా మాత్రం దేశంలో కరోనా తీవ్రంగానే ఉంది.

రాష్డ్రాల్లో కరోనా కేసుల వివరాలు


ప్రపంచ దేశాల్లో కరోనాకేసుల వివరాలు
First published: June 28, 2020, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading