40 చపాతీలు, 10 ప్లేట్ల అన్నం... క్వారంటైన్‌లో యువకుడి మెనూ..

40 చపాతీలు, 10 ప్లేట్ల అన్నం... క్వారంటైన్‌లో యువకుడి మెనూ..

(ప్రతీకాత్మక చిత్రం)

ఉదయం టిఫిన్‌గా 40 చపాతీలు, మధ్యాహ్నం భోజనంలో 10 ప్లేట్ల అన్నం, సాయంత్రం సరదాగా ఓ 26 లిట్టీలు తినడం చూసి క్వారంటైన్ సెంటర్‌లో మిగిలిన వారు అవాక్కయ్యారు.

  • Share this:
    ఉదయం టిఫిన్‌గా 40 చపాతీలు, మధ్యాహ్నం భోజనంలో 10 ప్లేట్ల అన్నం, సాయంత్రం సరదాగా తినడానికి ఓ 26 లిట్టీలు (గోధుమ పిండితో చేసే పొంగడాల లాంటి వంటకం). ఇలా ఎవరైనా తింటారా? అది కూడా క్వారంటైన్ సెంటర్లో. ఔను. ఆ యువకుడు తింటున్నాడు. బీహార్‌కు చెందిన 23 సంవత్సరాల ఓ యువకుడు డైలీ మెనూ ఇదే. ఆ రేంజ్‌లో కుంభకర్ణుడిలా తింటుంటే క్వారంటైన్ సెంటర్ నిర్వాహకులు ఎలా పెట్టారని అనుకోవద్దు. వారు పెట్టారు. అతడు తిన్నాడు. దాన్ని ఆ చుట్టుపక్కల వారు చూశారు కూడా. బీహార్‌లోని బక్సర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా వలస కూలీలు సొంత రాష్ట్రం బీహార్ చేరుకోగా, వారిని అధికారులు క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అలా ఉంచిన వారిలో 23 సంవత్సరాల అనూప్ ఓఝా కూడా ఉన్నాడు. ఖారాతండా పంచాయతీకి చెందిన అనూప్‌ రాజస్థాన్‌లో పని కోసం వలస వెళ్లాడు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల కారణంగా ఉపాధి లేదు. దీంతో కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. ఇక లాభం లేదనుకుని ఇంటికి బయలుదేరాడు. అలా వచ్చిన అనూప్‌ను బక్సర్‌లోని ఓ క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అతడు తినే తిండి చూసి అధికారులు, ఆ క్వారంటైన్ సెంటర్లోని మిగిలిన వారు కూడా అవాక్కయ్యారు. ఒకరోజు ఏకంగా ఏకంగా 83 లిట్టీలు తినడం చూసి పక్కన ఉన్నవాళ్లు బెంబేలెత్తిపోయారు. అతడి క్వారంటైన్ కాలం గురువారం (మే 28)తో ముగిసింది. ఒత్తిడి వల్ల కొందరు ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటారని, ఎంత తింటున్నామో కూడా తెలియనంతగా తింటారని గతంలో హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు