24 గంటల్లో 34 మృతి.. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం

మహారాష్ట్రలో ఇప్పటి వరకు 16,758 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 651 మంది మరణించారు.

news18-telugu
Updated: May 6, 2020, 8:39 PM IST
24 గంటల్లో 34 మృతి.. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం భారీ మొత్తంలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,233 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ మరో 34 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటి వరకు 16,758 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 651 మంది మరణించారు.

కాగా, శుక్రవారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 2,680 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 49,391 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 1,694 మరణాలు నమోదయ్యాయి. 33,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,022 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 14,183 మంది కోలుకున్నారు.
First published: May 6, 2020, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading