కరోనా దారుణం... పరీక్ష రాసిన 32 మంది విద్యార్థులకు పాజిటివ్... ఇలాగైతే కష్టమే...

కరోనా సోకిన తర్వాత తగ్గితే పర్వాలేదు... తగ్గకపోతే ఏంటన్నదే సమస్య. ఆ 32 మంది విద్యార్థుల పరిస్థితేంటి? ఎందుకిలా జరిగింది?

news18-telugu
Updated: July 4, 2020, 1:41 PM IST
కరోనా దారుణం... పరీక్ష రాసిన 32 మంది విద్యార్థులకు పాజిటివ్... ఇలాగైతే కష్టమే...
కరోనా దారుణం... పరీక్ష రాసిన 32 మంది విద్యార్థులకు పాజిటివ్... ఇలాగైతే కష్టమే...(File)
  • Share this:
కర్ణాటక ప్రభుత్వం పట్టుపట్టి SSLC పరీక్షలు జరిపింది. మొత్తం 761506 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. ఈ పరీక్షలు వద్దని ప్రతిపక్షం, ప్రజలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులూ... అందరూ కోరారు. కానీ... ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. పరీక్షలు రాయాల్సిందే అంది. ఇపుడు రాసిన వాళ్లలో 32 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదన మాటలకందనిది. ఈ SSLC ఎగ్జామ్ జూన్ 25 నుంచి జులై 3 వరకూ జరిగింది. కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ శనివారం రిలీజ్ చేసిన డేటాలో 32 మంది కరోనా ఉందని చెప్పడం షాకింగ్ విషయం.

ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. జులై 3న చివరి ఎగ్జామ్ జరిగింది కాబట్టి... అప్పటి నుంచి 14 రోజులు అంటే... జులై 17 వరకూ విద్యార్థులకు ఎప్పుడైనా కరోనా లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్స్ జరిగిన 9 రోజుల్లోనే 32 మందికి వైరస్ సోకిందంటే... ఇంకా ఎంతమందికి అది సోకిందో ఏమో. ప్రస్తుతం మరో 80 మంది విద్యార్థుల్ని ప్రభుత్వం ఇళ్లలోనే క్వారంటైన్ చేసింది. ఎందుకంటే... ఆ 80 మంది విద్యార్థులూ... ఈ 32 మంది విద్యార్థులకు ప్రైమరీ కాంటాక్ట్స్‌గా ఉన్నారు.

మరో విషయమేంటంటే... ఈ పరీక్షల్ని 3911 మంది విద్యార్థులు రాయలేకపోయారు. వాళ్లంతా కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్నారు. మరో 863 మంది కూడా రాయలేదు. వారికి ఆల్రెడీ ఆరోగ్యం బాలేదు.

ఈ పరీక్షల్ని మార్జి 27, ఏప్రిల్ 9 మంది జరపాలనుకున్నారు. అప్పుడేగా దేశంలో లాక్‌డౌన్ అమలైంది. అంతే... వాయిదా పడ్డాయి. ప్రభుత్వం మేలో కొత్త తేదీ ప్రకటించింది. అంతా అయిపోయింది. మరి ఈ 32 మంది విద్యార్థుల పరిస్థితేంటి? వాళ్లు కోలుకుంటే పర్వాలేదు... కోలుకోకపోతే... దానికి ఎవరు బాధ్యులు?

మన చుట్టూ చాలా మంది... కరోనా వచ్చినా ఏమీ కాదు... అదీ జ్వరం లాంటిదే అంటూ ఏవేవో చెబుతున్నారు. దయచేసి ఆ మాటల్ని పూర్తిగా నమ్మేయకండి. ఎందుకంటే... కరోనా వచ్చినప్పుడు జ్వరం వస్తుందే తప్ప... కరోనా జ్వరం లాంటిది కాదు. కరోనా వైరస్... ఊపిరి తిత్తుల్ని తింటుంది. అది బాడీలో 14 రోజులు ఉంటుంది. ఆ 14 రోజుల్లో కొన్ని వందల కోట్ల వైరస్‌లు ఊపిరి తిత్తుల్ని వీలైనంతవరకూ ఆహారంగా తింటాయి. అందువల్ల అవి చచ్చిపోయి మనిషి కోలుకున్నా... ఊపిరి తిత్తులు మాత్రం చాలా మందికి సెట్ కావు. అవి జీవితాంతం అడ్డమైన అనారోగ్యాలు తెస్తూనే ఉంటాయి. శ్వాస సంబంధ సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి... ఎట్టి పరిస్థితుల్లో కరోనా రాకూడదు. ఆ విధంగా మనసులో గట్టిగా అనుకోవాలి.
Published by: Krishna Kumar N
First published: July 4, 2020, 1:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading