2DG DRUG HOW DOES DRDO ANTI COVID DRUG WORK HERE IS KEY DETAILS ABOUT GAME CHANGER MEDICINE SK GH
DRDO Drug: డీఆర్డీవో డ్రగ్ 2-DG ఎలా పనిచేస్తుంది? కరోనాకు ఎలా చెక్ పడుతుంది?
ప్రతీకాత్మక చిత్రం
కరోనా రోగుల ఆక్సిజనల్ లెవల్ తగ్గిపోవడంతో పాటు వారి పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారుతుంది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు యాంటీ కోవిడ్ డ్రగ్ అయిన 2–డీజీ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని డీఆర్డీవో చెబుతోంది
కరోనా మహమ్మారి కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వస్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన 2డీ ఆక్సీ డీ-గ్లూకోజ్ మందును ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ మందును డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఉత్పత్తి చేస్తోంది. ఈ మందు వాడకానికి డీసీజీఐ అత్యవసర అనుమతులిచ్చింది. ఈ మందు వాడకంతో కరోనా రోగులు మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని డీఆర్డీఓ పరిశోధకులు స్పష్టం చేశారు. రోగి త్వరగా కోలుకోవడానికి 2డీజీ మందు బాగా పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. పొడి రూపంలో లభించే ఈ మెడిసిన్‌ను నీటిలో కలుపుకొని తాగవచ్చు. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
ఎలా పని చేస్తుంది?
కరోనా రోగుల ఆక్సిజనల్ లెవల్ తగ్గిపోవడంతో పాటు వారి పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారుతుంది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు యాంటీ కోవిడ్ డ్రగ్ అయిన 2–డీజీ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని డీఆర్డీవో చెబుతోంది. శరీరంలో గ్లూకోజ్ ఎలాగైతే పనిచేస్తుందో, అదేమాదిరిగా ఈ మందు కూడా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్కు గురైన కణాల్లో చేరి వాటి శక్తిని తగ్గిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్ వ్యాపించడం లేదా దాని వృద్ధి తగ్గిపోతుంది. తద్వారా రోగి ఆక్సిజన్ సపోర్ట్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటాడు.
కరోనాను కట్టడి చేయగలదా?
ఈ మందు కరోనా నుంచి వేగంగా బయటపడేలా చేస్తుంది. అంతేకాక, మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో కోవిడ్–19 రోగుల లక్షణాలు వేగంగా మెరుగుపడ్డాయి. ట్రయల్స్‌లో భాగంగా 42 శాతం మంది రోగులకు స్టాండర్డ్ కేర్‌తో పాటు 2–డీజీ డ్రగ్ కూడా ఇచ్చారు. దీంతో మూడో రోజు నుంచి వారు ఆక్సిజన్ మీద ఆధారపడటం పూర్తిగా తగ్గుతూ వచ్చింది.65 ఏళ్లకు పైబడిన రోగుల్లో కూడా ఈ ట్రెండ్ కనిపించడం విశేషం. వారిలో కేవలం 30% మందికి మాత్రమే మెడికల్ ఆక్సిజన్ అవసరం ఏర్పడింది.
ఎంత ఖర్చు అవుతుంది?
ఈ డ్రగ్ ధరను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కాని, ఒక్కో సాచెట్కు రూ. 500 నుంచి రూ.600 ఖర్చవుతుందని డీఆర్డీఓ వర్గాలు చెబుతున్నాయి. కానీ భారీ స్థాయిలో వీటిని ఉత్పత్తి చేయడం ద్వారా దీని ధర కాస్త తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై DRDOతో కలిసి పనిచేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఇప్పటికే వీటి ఉత్పత్తిని ప్రారంభించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.