news18-telugu
Updated: October 19, 2020, 7:33 PM IST
ప్రతీకాత్మకచిత్రం
ఏపీలో కరోనా రికవరీల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా పోరులో రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తాజా బులిటెన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 61,330 టెస్టులు చేయగా 2,918 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలపై బులిటెన్ విడుదల చేసింది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 7,86,050కు చేరింది. అందులో 7,44,532 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 4,303 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో ఇప్పటి వరకు 6,453 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం కరోనా రికవరీ రేటు బాగా పెరుగుతోందని, రోజు రోజుకీ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా కరోనా కేసుల సంఖ్య
వైరస్ వ్యాప్తి కూడా కంట్రోల్లోకి వచ్చిందని పేర్కొంది. ఇప్పటి వరకు 7,44,532 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 35,065గా ఉందని తెలిపింది.
Published by:
Krishna Adithya
First published:
October 19, 2020, 7:33 PM IST