చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ జైల్లో 29 మందికి కరోనా..

చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ జైల్లో 29 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది.

news18-telugu
Updated: August 8, 2020, 10:15 PM IST
చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ జైల్లో 29 మందికి కరోనా..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ జైల్లో 29 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. 161 మంది ఖైదీలకు కరోనా టెస్టులు చేయగా, అందులో 29 మందికి వైరస్ సోకినట్టు తేలింది. రెండు రోజులుగా ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ‌శుక్రవారం 11 మందికి, శనివారం 18 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిని 108 అంబులెన్స్ ద్వారా చిత్తూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు.
రిమాండ్ పై వచ్చిన వారిని ఖైదీలతో కలిసి వుంచడంతో కరోనా కేసులు పెరిగినట్లు తెలిసింది. అసలే కరోనా రాజ్యమేలుతున్న సమయంలో ముందు జాగ్రత్తగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి గాని లేక బయట నుంచి వచ్చే రిమాండ్, శిక్ష పడిన వారిని అక్కడే 15 రోజుల పాటు విడిగా ఉంచి తర్వాత పరీక్షలు చేయాల్సిన జైలు అధికారులు వచ్చిన వారిని ముందు వున్న వారితో కలిపి వుంచడం వలన అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఇతర ఖైదీలకు కరోన సోకడం ప్రారంభమైంది. ఇటీవల పీలేరుకు చెందిన వ్వక్తి‌ రిమాండ్ పై మదనపల్లె సబ్ జైల్ రాగా అతని వల్ల మొత్తం 29 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని తెలిసింది. ఇకనైనా అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఖైదీల బంధువులు వాపోతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 8, 2020, 10:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading