మహారాష్ట్రలో 10వేలు దాటిన కరోనా కేసులు.. 459 మంది మృతి

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,823 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 67 మంది చనిపోయారు.

news18-telugu
Updated: April 30, 2020, 9:53 PM IST
మహారాష్ట్రలో 10వేలు దాటిన కరోనా కేసులు.. 459 మంది మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 583 కరోనా కేసులు నమోదవగా.. మరో 27 మరణించారు. వీటితో కలిపి మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,498కి చేరింది. ఇప్పటి వరకు 459 మంది మరణించారు. మహారాష్ట్రలోని కరోనా బాధితుల్లో అత్యధిక మంది ముంబైలోనే ఉన్నారు. మహారాష్ట్రలో గురువారం నమోదైన కేసుల్లో ఒక్క ముంబైలోనే 417 కేసులు వచ్చాయి. ఈ మహా నగరంలో గురువారం 20 మరణాలు నమోదయ్యాయి. ముంబైలో ఇఫ్పటి వరకు 6,875 కరోనా కేసులు నమోదవగా.. ఇప్పటి వరకు 290 మంది చనిపోయారు.


ఇక కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,823 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 67 మంది చనిపోయారు. తాజా లెక్కలతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,610కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 8,373 మంది కోలుకోగా.. 1,075 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో 24,162 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: April 30, 2020, 9:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading