ఏపీలో 252కు పెరిగిన కరోనా కేసులు... ఒకే జిల్లాలో 53...

ఏపీలో ఈ ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 252కు పెరిగింది.

news18-telugu
Updated: April 5, 2020, 7:51 PM IST
ఏపీలో 252కు పెరిగిన కరోనా కేసులు... ఒకే జిల్లాలో 53...
ప్రతీకాత్మక చిత్రం(credit - NIAID)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు పెరిగింది. ఈ రోజు (ఏప్రిల్ 5)న ఇప్పటి వరకు కొత్తగా 26 కోరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆ రిపోర్టులో తెలిపింది. ఆ కొత్త కేసులన్నీ కర్నూలు జిల్లాలోనే కావడంతో ఆ జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదుగురు పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక జిల్లాల వారీగా చూస్తే ఈ ఒక్కరోజే 26 కొత్త కరోనా కేసులు రావడంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 53కు పెరిగింది. నెల్లూరు (34), గుంటూరు (30), కృష్ణా జిల్లాల్లో (28) అత్యధికంగా కేసులు ఉన్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు


రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. బాధితులు ఉండే ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలిపింది. వారితో కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్‌కు తరలించినట్టు తెలిపింది. అలాగే, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను స్వీయ నిర్బంధంలోకి పంపినట్టు స్పష్టం చేసింది.

First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading