Covid-19 Andhra pradesh: ఏపీని వణికిస్తున్న కరోనా.. కొత్తగా 40 మరణాలు

Covid-19 Andhra pradesh: కొద్దిరోజుల క్రితం వరకు రోజుకు పదిమంది లోపే ఉన్న కరోనా మరణాల సంఖ్య... ఇప్పుడు రోజుకు 40 వరకు నమోదవుతోంది.

news18-telugu
Updated: July 16, 2020, 4:05 PM IST
Covid-19 Andhra pradesh: ఏపీని వణికిస్తున్న కరోనా.. కొత్తగా 40 మరణాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా ఉగ్రరూపంలో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. రోజురోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38044కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు రోజుకు పదిమంది లోపే ఉన్న కరోనా మరణాల సంఖ్య... ఇప్పుడు రోజుకు 40 వరకు నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లోనూ రాష్ట్రంలో 40 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 493కి చేరింది. ఇక ఏపీలో యాక్టివ్ కేసులు సంఖ్య 18159 ఉండగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19393కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 22304 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1240267 కరోనా టెస్టులు చేశారు.



మరోవైపు కరోనా నివారణా చర్యల పట్ల మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్లుకు సీఎం వైఎస్‌ జగన్ సూచించారు. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా కోవిడ్‌ వచ్చిందన్న అనుమానం రాగానే ఏం చేయాలన్న దానిపై అవగాహన ఉండాలని... ఎవరికి ఫోన్‌ చేయాలి ? ఏం చేయాలన్నదానిపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయన్నదానిపై అవగాహన కలిగించాలని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 16, 2020, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading