భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు.

  • Share this:
    తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు. చర్ల మండలం కలివేరు క్యాంప్‌లో ఉంటున్న సీఆర్పీఎఫ్ జవాన్లలో 23 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. రెండు వారాల క్రితం వారంతా వివిధ రాష్ట్రాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని క్యాంప్‌నకు వచ్చారు. మరో ఏడుగురి రిజల్ట్స్ రేపు వెలువడనున్నాయి. ఇప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైన 44 కేసుల్లో40 ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చారు. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. భద్రం భద్రాద్రి మిషన్‌ను కొనసాగించాలని కోరుతున్నారు.

    తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1410 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30946కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ 19 కారణంగా చనిపోయిన వారి సంఖ్య 331కి చేరింది.కరోనా నుంచి కొత్తగా 913 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనాను జయించిన వారి సంఖ్య 18192కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 12423 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఈరోజు నమోదైన కేసుల్లో 918 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: