హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ప్రధాని మోదీ ముందు 22 ప్రతిపక్షాల 11 డిమాండ్లు...

ప్రధాని మోదీ ముందు 22 ప్రతిపక్షాల 11 డిమాండ్లు...

సోనియాగాంధీ(ఫైల్ ోటో)

సోనియాగాంధీ(ఫైల్ ోటో)

కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ఓ క్రూరమైన జోక్‌గా 'సోనియాగాంధీ అభివర్ణించారు.

ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో పేదలను ఆదుకునేందుకు 22 విపక్షాలు కేంద్రం ముందు 11 డిమాండ్లు ఉంచాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో 22 విపక్ష పార్టీలకు చెందిన నేతలు సమావేశం అయ్యారు. పేదలను ఆదుకునేందుకు వారికి నెలకు రూ.7500 డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేయడంతో పాటు పేదలను ఇంటికి చేర్చడం, ‘నిజమైన’ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం వంటి అంశాలను ప్రభుత్వం ముందు ఉంచారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన చేతిలోకి తీసుకోవాలనుకుంటోందని విపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి. నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్రాలను కూడా సంప్రదించాలని డిమాండ్ చేశాయి. ‘వ్యక్తి స్వామ్యాన్ని, వన్ మ్యాన్ షోను చూపించుకోవడానికి ఇది సమయం కాదు. సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. అదే దేశ ప్రజలకు అవసరం, డిమాండ్ కూడా.’ అని విపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రతిపక్షాలు దేశంలోని 60 శాతం మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాయి.

జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహా రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, మాజీ ప్రధాని దేవె గౌడ తదితరులు హాజరయ్యారు. మాయావతి, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

1. పేదలకు నెలకు రూ.7500 చొప్పున ఆరు నెలల పాటు బ్యాంక్ ఖాతాల్లో వేయాలి. వెంటనే రూ.10,000 చెల్లించాలి. మిగిలినవి ఐదు నెలల్లో ఇవ్వాలి.

2. ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున ఆహారధాన్యాలు ఉచితంగా ఆరు నెలల పాటు ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పొడిగించాలి.

3. వలస కార్మికులను వారి ఇంటికి ఉచితంగా చేర్చాలి.

4. కార్మిక చట్టాలను మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

5. విమానాలు నడిపే ముందు రాష్ట్రాలను సంప్రదించాలి.

ప్రస్తుతం అన్ని అధికారాలు ఒకే చోట కేంద్రీకృతం అయ్యాయని సోనియాగాంధీ విమర్శించారు. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ఓ క్రూరమైన జోక్‌గా అభివర్ణించారు.

First published:

Tags: Coronavirus, Covid-19, Pm modi, Sonia Gandhi

ఉత్తమ కథలు