దేశంలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 20వేలకు పైగా కేసులు..

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: July 3, 2020, 11:10 AM IST
దేశంలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 20వేలకు పైగా కేసులు..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా ఉగ్రరూపం అంతకంతకు ఎక్కువవుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 20 వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 625544కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి 379892కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా చనిపోయిన సంఖ్య 379గా నమోదైంది. దీంతో దేశంలో కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 18213కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 241576 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన కోవిడ్ 19 టెస్టుల సంఖ్య 9297749కు చేరుకుంది. మరోవైపు దేశంలో రికవరీ రేటు 60.7కు చేరింది.

Corona cases india, new corona cases india, covid 19 india, ఇండియాలో కరోనా కేసులు, దేశంలో కొత్త కరోనా కేసులు, కోవిడ్ 19 కేసులు
కరోనా కేసుల అప్‌డేట్


మరోవైపు నిన్న కరోనా కేసుల స్థాయిలోనే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఉండటం ఊరట కలిగించే విషయం. ఇక కరోనా కేసుల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందున్న మహారాష్ట్రలో వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఆ సంఖ్య లక్ష దాటింది.
First published: July 3, 2020, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading