గుంపులు గుంపులుగా అంత్యక్రియలకు... 20 మందికి కరోనా

గుంపులు గుంపులుగా అంత్యక్రియలకు... 20 మందికి కరోనా

ప్రతీకాత్మక చిత్రం

అంత్యక్రియలు జరిగిన 2 రోజుల తర్వాత మృతుడి మేనల్లుడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేస్తే కరనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత అదే కుటుంబంలో మరో ఇద్దరు కరోనా బారినపడ్డారు.

 • Share this:
  'కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరించడంతో పాటు ఇతరులకు 2 మీటర్ల భౌతిక దూరం పాటించాలి.' ప్రభుత్వాలు పదే పదే ఈ సూచనలు చేస్తున్నాయి. కానీ దేశంలో కరోనా విజృంభిస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించి బీహార్‌‌లో 20 మంది కరోనా బారినపడ్డారు. ఓ పారిశ్రామిక వేత్త అంత్యక్రియలకు హాజరైన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. బిహ్టా పట్టణంలో ఈ ఘటన జరిగింది.

  బీహార్ వైద్యాధికారులు చెప్పిన వివరాల ప్రకారం..రాజ్ కుమార్ అనే పారిశ్రామిక వేత్త అనారోగ్యంతో ఈ నెల 10న మరణించారు. ఆయన అంత్యక్రియలకు బంధువులు, తెలిసిన వాళ్లు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంత్యక్రియలకు 20 మందికి మించి ఎక్కువ ఉండకూడదని ప్రభుత్వాలు చెబుతున్నా వినకుండా.. చాలా మంది వెళ్లారు. అంత్యక్రియలు జరిగిన 2 రోజుల తర్వాత మృతుడి మేనల్లుడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేస్తే కరనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత అదే కుటుంబంలో మరో ఇద్దరు కరోనా బారినపడ్డారు.

  విషయం తెలుసుకున్న వైద్యాధికారులు.. అంత్యక్రియలకు హాజరైన వారికి కరోనా పరీక్షలు చేశాయి. అందులో 20 మందికి పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు బిహ్టాను కంటైన్‌మెంట్ జోెన్‌గా ప్రకటించి..పట్టణాన్ని శానిటైజ్ చేస్తున్నారు. కాగా, బీహార్‌లో ఇప్పటి వరకు 16,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,953 మంది కోలుకోగా.. 125 మంది మరణించారు. ప్రస్తుతం బీహార్‌లో 4,227 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు