ఏపీలో ఒక్క జిల్లాలోనే ఆరుగురికి కరోనా.. కేసుల సంఖ్య జిల్లాల వారీగా..

ఏపీలో విశాఖ జిల్లాలోనే ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనా బాధితులు ఉన్నారు.

news18-telugu
Updated: March 29, 2020, 9:31 PM IST
ఏపీలో ఒక్క జిల్లాలోనే ఆరుగురికి కరోనా.. కేసుల సంఖ్య జిల్లాల వారీగా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతంలో యూకే నుంచి వచ్చి కరోనా బారిన పడిన పేషెంట్ నెంబర్ 7కు కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు కాంటాక్ట్ కావడంతో కరోనా వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. ఏపీలో ఈరోజు 102 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారికి నెగిటివ్ వచ్చింది. అయితే, గతంలో జరిపిన పరీక్షలు పెండింగ్ రిపోర్టుల్లో ఈరోజు ఇద్దరికి నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లోని కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పరీక్షలకు అనుమతులు ఇచ్చింది. ఏపీలో విశాఖ జిల్లాలోనే ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనా బాధితులు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురికి కరోనా సోకింది. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా బాధితులు ఉన్నారు.

ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న వారు


జిల్లాల్లో కేవలం కరోనాతోపాటు ఇతర కేసులను కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు  ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన కేసులను కూడా పరిశీలించాలని టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 616 మందికి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించింది. అందులో 21 మందికి పాజిటివ్ వచ్చింది. 100 మంది రిపోర్టు రావాల్సి ఉంది.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading