కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఆరు లక్షలు దాటిన కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటిపోయింది.

news18-telugu
Updated: July 2, 2020, 10:10 AM IST
కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఆరు లక్షలు దాటిన కేసులు
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటిపోయింది. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 604641కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి 359859కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా చనిపోయిన సంఖ్య 434గా నమోదైంది. దీంతో దేశంలో కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 17834కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 229588 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన కోవిడ్ 19 టెస్టుల సంఖ్య 9056173కు చేరుకుంది.

Corona cases india, new corona cases india, covid 19 india, ఇండియాలో కరోనా కేసులు, దేశంలో కొత్త కరోనా కేసులు, కోవిడ్ 19 కేసులు
దేశంలో కరోనా కేసుల అప్‌డేట్


ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షకు అర్హత ఉండే ప్రతి ఒక్కరిని పరీక్షించేలా క్వాలిఫైడ్ మెడికల్ సిబ్బందికి అనుమతికి అనుమతి ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ప్రైవేటు రంగంలో పరీక్షలు తక్కువగా జరగడంపై కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా రాసిన లేఖలో ప్రస్తావించింది. కోవిడ్ 19 ల్యాబ్‌ల్లో పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కొన్ని రాష్ట్రాలు కేవలం ప్రభుత్వం డాక్టర్లు సూచించిన వారికి మాత్రమే కరోనా టెస్టులు చేయాలని సూచించడాన్ని ప్రస్తావించింది. ప్రభుత్వ ఆరోగ్య రంగంపై ఒత్తిడి పెరగకుండా ఉండేలా... కరోనా పరీక్షల్లో జాప్యం జరగకుండా చూడాలని కోరింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు ఏ ఒక్కరిని కరోనా పరీక్షలు చేయించుకోకుండా అడ్డుకోవద్దని... సాధ్యమైనంత తొందరగా పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని పేర్కొంది.
First published: July 2, 2020, 10:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading