కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో 19 మందికి కరోనా పాజిటివ్..

పూణె, థానే, బెంగళూరు, హైదరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపింది.

ఓ మహిళ(55) అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఈనెల 9న కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయింది. దీంతో వైద్యులు ఆమె నుంచి శాంపిల్స్ సేకరించారు.

  • Share this:
    ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనాతో చనిపోయిన మహిళ అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా వీరందరికి వైరస్ సోకినట్టు తేలింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జహీరాబాద్‌కు చెందిన ఓ మహిళ(55) అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఈనెల 9న కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయింది. దీంతో వైద్యులు ఆమె నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈలోపే ఆ మహిళకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. శాంపిల్స్‌లో సదరు మహిళకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో చనిపోయిన మహిళకు సన్నిహితంగా తిరిగిన కుటుంబ సభ్యులు, బంధువులను గుర్తించి మిర్జాపూర్(బి)లోని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లి 25 మంది శాంపిల్స్ సేకరించారు.

    కాగా శుక్రవారం రాత్రి 25 మందిలో 19 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా తేలింది. దీంతో ఖంగుతిన్న అధికారులు వారందరినీ సంగారెడ్డిలో జిల్లా ఆస్పత్రికి తరలించనున్నారు. కరోనా సోకిన వారిలో పెద్దవారితో పాటు చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు. ఇదిలావుంటే.. అంత్యక్రియల్లో పాల్గొన్న దాదాపు 40 మంది గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కరోనా వైరస్ వచ్చిన ప్రాంతనంతా కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
    Published by:Narsimha Badhini
    First published: