దేశంలో కరోనా విజృంభణ... అదొక్కటే ఊరట

భారత్‌లో అరివీర భయంకరంగా కరోనా... భారీగా కొత్త కేసులు, మరణాలు...

గడిచిన 24 గంటల్లో కొత్తగా 18522 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 566840కు చేరింది.

  • Share this:
    దేశంలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18522 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 566840కు చేరింది. ఇక కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 418 మంది చనిపోగా... ఈ వైరస్ కారణంగా దేశంలో మరణించిన వారి సంఖ్య మొత్తంగా 16893కు చేరింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ శాతం రోగులు వైరస్ నుంచి కోలుకోవడం ఒక్కటే ఊరట కలిగించే విషయం. కరోనా నుంచి 334822 మంది కోలుకోగా, ప్రస్తుతం 215125 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 210292 కరోనా టెస్టులు చేయగా...ఇప్పటివరకు చేసిన టెస్టుల సంఖ్య 8608654కు చేరింది. కరోనా కేసుల విషయంలో 169883 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, 86224 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 85161 పాజిటివ్ కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచించి. ఏపీలో 13891 కరోనా కేసులు నమోదు కాగా, తెలంగాణలో 15394 కేసులు రికార్డయ్యాయి.


    First published: