తెలంగాణలో కరోనా కల్లోలం.. 25 వేలు దాటిన కేసులు.. 300 దాటిన మరణాలు

గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 11 మంది చనిపోయారు. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 306కు చేరింది.

news18-telugu
Updated: July 6, 2020, 9:51 PM IST
తెలంగాణలో కరోనా కల్లోలం.. 25 వేలు దాటిన కేసులు.. 300 దాటిన మరణాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1831 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1419 ఉండటం హైదరాబాద్‌లో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25733కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 11 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 306కు చేరింది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా ఇవాళ భారీగానే ఉంది. నేడు కొత్తగా 2078 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 14781కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10646గా ఉంది. నేడు రాష్ట్రంలో మొత్తం 6383 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ 19 టెస్టుల సంఖ్య 122218కు చేరుకుంది.

Telangana corona cases, new corona cases in telangana, telangana corona virus cases today, covid 19 cases in telangana, తెలంగాణ కరోనా కేసులు, తెలంగాణలో కొత్త కరోనా కేసులు, తెలంగాణ న్యూస్
తెలంగాణ కరోనా బులెటిన్


జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో కొత్తగా 1419 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి 160, మేడ్చల్ 117, మంచిర్యాల 20, ఖమ్మం 21, మెదక్ 20, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో 9, వికారాబాద్ 7, సూర్యాపేట 6, కరీంనగర్ జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి.
Published by: Kishore Akkaladevi
First published: July 6, 2020, 9:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading