హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Telangana: బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 16 మందికి కరోనా.. తెలంగాణ సర్కార్ ప్రకటన

Telangana: బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 16 మందికి కరోనా.. తెలంగాణ సర్కార్ ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని... ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్ల వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగామని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

  డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1200 మంది బ్రిటన్ నుంచి వచ్చారని.. వీరిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో 16 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు చెప్పారు. 16 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు లో ఉంచామని వెల్లడించారు.

  16 మందికి 76 మందికి అతిసన్నిహితంగా ఉన్న వారిని కూడా గుర్తించామని తెలిపారు. వారిని క్వారేంటిన్ లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేస్తున్నామని చెప్పారు. 16 మంది లో ఉన్న వైరస్ జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవడానికి కోసం సిసిఎంబి కి పంపించామని... మరో రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారు లేదా బ్రిటన్ మీదుగా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్ కి వాట్స్ ఆప్ ద్వారా అందిచాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వారి ఇంటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేస్తారని అన్నారు.

  కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని... ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్ల వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగామని అన్నారు. మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని కోరారు. కొత్త రకం వైరస్ తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ తప్పని సరిగా వాడండి, భౌతిక దూరం పాటించాలని.. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Coronavirus, Telangana, UK Virus

  ఉత్తమ కథలు