లాక్ డౌన్ నుంచి తప్పించుకోవడానికి వీళ్లు వేసిన ప్లాన్ చూస్తే...

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొన్న వేళ ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు రకరకాల ప్లాన్లు చేస్తున్నారు.

news18-telugu
Updated: March 27, 2020, 9:11 AM IST
లాక్ డౌన్ నుంచి తప్పించుకోవడానికి వీళ్లు వేసిన ప్లాన్ చూస్తే...
యూపీలో పాల ట్యాంకర్‌లో ప్రయాణం
  • Share this:
తెలుగులో ఓ సామెత ఉంటుంది. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొన్న వేళ ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు రకరకాల ప్లాన్లు చేస్తున్నారు. రైళ్లు, బస్సులు నడవకపోవడంతో ప్రజలు అడ్డదారిలో సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈక్రమంలో తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. తమ సొంత గ్రామాలకు చేరుకునేందుకు 16 మంది ఏకంగా ఓ చిన్న పాల ట్యాంకర్‌లో దాక్కుని ప్రయాణం చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. ఒక చోట చిన్న పాల ట్యాంకర్ ఉంటే, దానిలో నుంచి బ్యాగ్‌లు తీసుకుని యువకులు బయటకు దిగుతున్నారు. ఇదేదో విచిత్రంగా ఉందని, కొందరు దాన్ని వీడియో తీశారు. అలా, మొత్తం 16 మంది యువకులు ఆ చిన్న పాల ట్యాంకర్‌లో నుంచి బయటకు వచ్చారు. అసలే పాల ట్యాంకర్, అందులో 10 మంది కూర్చోవడానికి కూడా వీలుపడదు. అలాంటి చోట 16 మంది కూర్చుని, వారితో పాటు బ్యాగ్‌లు కూడా తీసుకుని రావడం అంటే ఓ రకంగా ప్రాణాలతో చెలగాటం ఆడడమే. అయినా వారు ప్రాణాలకు తెగించి ఇలా ప్రయాణించి సొంతూళ్లకు చేరుకున్నారు.First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు