హైదరాబాద్ లో 155 మంది పోలీసులకు కరోనా...

ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 155 మంది ఈ వైరస్ బారినపడ్డారు.

news18-telugu
Updated: June 17, 2020, 1:01 PM IST
హైదరాబాద్ లో 155 మంది పోలీసులకు కరోనా...
ప్రజలను కాపాడే ప్రయత్నంలో వీరంతా కరోనా బారినపడినట్లు తెలుస్తోంది
  • Share this:
హైదరాబాద్ పోలీసులను కరోనా కలవరపెడుతోంది. కరోనా నివారణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న పోలీసులు కరోనావైరస్ బారినపడుతున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 155 మంది ఈ వైరస్ బారినపడ్డారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రత్తమయ్యారు. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు విధులకు హాజరవొద్దని.. ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకోవాలని సూచించారు...

రోజురోజుకు పోలీసుశాఖలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. ప్రజలను కాపాడే ప్రయత్నంలో వీరంతా కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా 15 మంది పోలీసులకు కరోనా సోకింది. వారం రోజుల నుంచి సిటీలో జరుపుతున్న కరోనా టెస్టుల ద్వారా ఇవన్నీ బయటపడుతున్నాయి. తాజాగా సోమవారం 20 మంది పోలీసులకు కరోనా కన్ఫర్మ్ అయింది. సిటీలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు 155 మంది పోలీసులకు సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. కుల్సుపురా పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ మే 20న కరోనా బారినపడి చనిపోయాడు. దాంతో ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన పోలీసులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమతో పాటు తమ కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకే అవకాశముండటంతో.. వారివారి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా క్వారంటైన్ చేసి అందరికీ టెస్టులు చేస్తున్నారు. కరోనా సోకిన పోలీసుల కోసం గాంధీ ఆస్పత్రిలో స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. కోల్డ్, ఫీవర్, కఫ్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ లక్షణాలు లేనివారికి నేచర్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన పోలీస్ స్టేషన్లలో డిసింన్ఫెక్ట్స్ స్ప్రే చేస్తున్నారు.

Published by: Venu Gopal
First published: June 17, 2020, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading