ఏపీలోని ఆ జిల్లాలో 1500 మంది కరోనా బాధితుల అడ్రస్ గల్లంతు

Nellore: 1500 మంది పాజిటివ్ కేసు చిరునామాలు గల్లంతు కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు రోజులుగా జాయింట్ కలెక్టర్ స్వాబ్ సేకరణ కేంద్రాల్లో డేటా ఎంట్రీను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 5, 2020, 3:50 PM IST
ఏపీలోని ఆ జిల్లాలో 1500 మంది కరోనా బాధితుల అడ్రస్ గల్లంతు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా సోకిన వారిని ఆస్పత్రుల్లో లేక హోం ఐసోలేషన్‌లో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారికి ఉన్న లక్షణాలను బట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో మాత్రం 1500 మంది కరోనా బాధితుల అడ్రస్ తెలియకపోవడం కలవరం రేపుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన 1500 మంది ఎందరితో కాంటాక్ట్ అయ్యారో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా స్వాబ్ టెస్టుల సందర్భంగా బాధితుల అడ్రస్ తీసుకుని వారి అప్లికేషన్‌కు ప్రత్యేకమైన నంబర్ ఇస్తారు. దాని ప్రకారమే పరీక్షలు జరిపి రిపోర్టులు వెల్లడిస్తారుఅయితే స్వాబ్ టెస్ట్ ట్యూబ్‌లకు నంబర్లు ఇచ్చిన సిబ్బంది...బాధితుల అసలు చిరునామాలను కంప్యూటర్‌లో నమోదు చేయడం మరిచినట్టు తెలుస్తోంది.

ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తరువాత నంబరింగ్ ఆధారంగా వెతికితే.. వాటికి సంబంధించి అడ్రస్‌లు కంప్యూటర్‌లో కనిపించడం లేదు. దీంతో 1500 పాజిటివ్ పేషెంట్ల వివరాలు తెలియడం లేదు. వైద్యశాఖ నుంచి వారి టెస్టులకు సంబంధించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో... వారంతా తమకు నెగిటివ్ వచ్చిందని ప్రాణాలు మీదకు తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వీరి వల్ల ఇతరులకు కరోనా సోకే ప్రమాదం కూడా పొంచి ఉంది.

Nellore news, corona virus, covid 19 cases in Nellore, ap corona cases, Nellore corona cases, నెల్లూరు న్యూస్, కరోనా వైరస్, నెల్లూరులో కోవిడ్ 19 కేసులు, ఏపీ కరోనా కేసులు, నెల్లూరు కరోనా కేసులు
కరోనా పరీక్షలు(ఫైల్ ఫోటో)


మరోవైపు 1500 మంది పాజిటివ్ కేసు చిరునామాలు గల్లంతు కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు రోజులుగా జాయింట్ కలెక్టర్ స్వాబ్ సేకరణ కేంద్రాల్లో డేటా ఎంట్రీను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా జిల్లాలో నెగిటివ్ వచ్చిన వారికి కూడా మేసేజ్‌లు వెళుతున్నాయి. నెల్లూరులో మాత్రం ఫలితాలు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. పాజిటివ్ వచ్చిన వారికే మాత్రమే ఫోన్ చేస్తున్నారు. దీంతో మిగతా వాళ్లు నెగిటివ్ వచ్చినా.. తమ ఫలితం ఇంకా రాలేదనే ఆందోళనలో ఉన్నారనే వాదన వినిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: August 5, 2020, 3:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading