Home /News /coronavirus-latest-news /

Covid-19 Dead bodies: మరీ ఇంత ఘోరమా? ఏడాదిన్నరగా మార్చురీలో కుళ్లిపోయిన కోవిడ్ మృతదేహాలు

Covid-19 Dead bodies: మరీ ఇంత ఘోరమా? ఏడాదిన్నరగా మార్చురీలో కుళ్లిపోయిన కోవిడ్ మృతదేహాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid-19 Dead bodies: పాత మార్చురీలో ఉన్న మృతదేహాలను కొత్త మార్చురీలోకి షిఫ్ట్ చేశారు. కానీ రెండు మృతదేహాలను మాత్రం మరిచిపోయి, అలాగే వదిలేశారు. ఏడాదిన్నరగా కాలంగా అవి ఫ్రీజర్‌లోనే ఉండిపోయి, చివరకు కుళ్లిపోయాయి.

    ప్రభుత్వాస్పత్రుల్లో నిర్లక్ష్యానికి పరకాష్ట ఇది. మార్చురీలో రెండు శవాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను (Covid Dead Bodies) ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో పడేసి మర్చిపోయారు. ఒక్కరోజు కాదు రెండు రోజులు ఏకంగా ఏడాదిన్నర పాటు అవి మార్చురీలోనే ఉన్నాయి. ఐనా ఎవరూ పట్టించుకోలేదు. వాస్తవానికి కరోనాతో మరణించిన వారి మృతదేహాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి..మార్చురీలో భద్రపరచాలి. ఆ తర్వాత కోవిడ్ ప్రొటోకాల్ (Covid Protocol)  ప్రకారం అంత్యక్రియలు జరపాలి లేదా కుటుంబ సభ్యులకు అప్పగించాలి. కానీ ఇవేమీ చేయకుండా ఏడాదిన్నర పాటు మార్చురీలోనే శవాలను పడేయంతో అవి పూర్తిగా కుళ్లిపోయాయి. బెంగళూరులోని ఈఎస్ఐ ఆస్పత్రి (ESI Hospital) లో ఈ దారుణం వెలుగుచూసింది.

    బెంగళూరులోని ఈఎస్ఐ ఆస్పత్రి మార్చురీలో కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. అవి ఏడాదిన్నర క్రితం కరోనాతో మరణించిన రోగులవి. మృతుల్లో ఒకరి పేరు దుర్గా సుమిత్ర. మరొకరి పేరు మునిరాజు. వైద్య అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం.. గత ఏడాది 40 ఏళ్ల సుమిత్ర, 66 ఏళ్ల మునిరాజు కరోనా బారినపడ్డారు. వైద్య చికిత్స కోసం బెంగళూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. ఐతే చికిత్స పొందుతూ జులై నెలలో వారిద్దరు మరణించారు. అనంతరం మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఆ తర్వాత బెంగళూరు మహానగర పాలక సంస్థ ( బీబీఎంపీ ).... కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం మృతదేహాలను దహనం చేయాలి. లేదంటే కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఐతే ఈ రెండూ చేయకుండా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. శవాలను పాత మార్చురీలో పడేసి చేతులు దులుపుకున్నారు. మళ్లీ వాటి దగ్గరకే వెళ్లలేదు. కానీ అంత్యక్రియలు పూర్తయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

    No Vaccine No Treatment: వ్యాక్సిన్ తీసుకోకుంటే.. ఉచిత వైద్యం బంద్.. సీఎం  సంచలన నిర్ణయం

    ఈఎస్ఐ ఆస్పత్రిలోని మార్చురీలో ఆరు కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఐతే గత ఏడాది ఆస్పత్రిలో కోవిడ్ మృతదేహా సంఖ్య భారీగా పెరగడంతో వాటిని మార్చురీలో భద్రపరచడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో డిసెంబరులో ఆస్పత్రిలో కొత్త మార్చురీని నిర్మించారు. అనంతరం పాత మార్చురీలో ఉన్న మృతదేహాలను కొత్త మార్చురీలోకి షిఫ్ట్ చేశారు. కానీ రెండు మృతదేహాలను మాత్రం మరిచిపోయి, అలాగే వదిలేశారు. ఏడాదిన్నరగా కాలంగా అవి ఫ్రీజర్‌లోనే ఉండిపోయాయి. ఇటీవల పాత మార్చురీని శుభ్రం చేస్తున్న సమయంలో ఆ మృతదేహాలు బయటపడ్డాయి. అవి పూర్తిగా కుళ్లిపోయాయి.

    Omicron: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఏమిటి?.. ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి

    మృతదేహాలను గుర్తించి ఆస్పత్రి సిబ్బంది బీబీఎంపీకి సమాచారం అందజేశారు. అనంతరం బీబీఎంపీ అధికారులు మృతుల బంధువుకు కాల్ చేశారు. గత ఏడాది అంత్యక్రియలు జరగలేదని, ఇంకా మార్చురీలో మృతదేహం ఉందని చెప్పారు. మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఐతే ఆస్పత్రి నిర్లక్ష్యంపై మృతుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. మరీ ఇంత ఘోరమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Omicron: కరోనా కొత్త వేరియంట్ టెన్షన్..ప్రయాణికులకు కొత్త రూల్స్..ఈ అర్థరాత్రి నుంచే అమలు

    నా సోదరుడు కరోనాతో గత ఏడాది మరణించాడు. కానీ మాకు మృతదేహాన్ని ఇవ్వలేదు. మేము తిరిగి ఇంటికి వెళ్లిపోయాం. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించినట్లు బీబీఎంపీ నుంచి సమాచారం అందింది. 17 నెలల తర్వాత బీబీఎంపీ నుంచి మరోసారి ఫోన్ కాల్ వచ్చింది. మృతదేహన్ని దహనం చేయలేదని చెప్పారు.
    మృతుడి సోదరుడు


    మృతదేహాన్ని మోయడానికి మాకు ఏమీ మిగల్లేదు. పూర్తిగా కుళ్లిపోయింది. మా బంధువులంతా వస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మేం ఎంతో బాధపడ్డాం. మాకు న్యాయం జరగాలి.
    మృతుడి బంధువు


    ప్రస్తుతం ఈ వ్యవహారం కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మార్చురీలో ఏడాదిన్నరగా మృతదేహాలను వదిలేస్తారా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bengaluru, Corona cases, Coronavirus, Covid-19, Karnataka

    తదుపరి వార్తలు