12 STUDENTS TEST COVID 19 POSITIVE AT IIT MADRAS PVN
Covid-19 : మళ్లీ మొదలైందిరా బాబు..మరోసారి అక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులకు కరోనా
ఐఐటీ-మద్రాస్
Covid-19 Positive at IIT Madras : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ-మద్రాస్)మరోసారి కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటోన్న ప్రజల్ని కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది
Covid-19 Positive at IIT Madras : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ-మద్రాస్)మరోసారి కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటోన్న ప్రజల్ని కరోనా(Corona Virus) మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. భారత్ లో నాలుగో వేవ్ అనుమానాలను బలపరుస్తూ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు(Tamilnadu) రాజధాని చెన్నైలోని ఐటీటీ మద్రాస్(IIT-Madras)లో కరోనా కలకలం రేగింది. 19 మంది విద్యార్థులకు కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా... 12 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు ప్రకటించారు. మూడు రోజుల కిందట ముగ్గురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో స్వల్ప లక్షణాలున్న పలువురికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వీరి నమూనాలను సేకరించి పరీక్షించగా.. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల ప్రకారం 12 మందికి పాజిటివ్ వచ్చింది.
ఒక్క ఐఐటీ మద్రాస్‌లోనే 12 పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు తప్పనిసరిగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రజలకు సూచించారు. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కేసులు క్రమంగా పెరుగుతూ ఉండటంతో మాస్క్ నిబంధనలు తప్పనిసరి చేస్తున్నాయి. ఢిల్లీలో మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా విధించనున్నారు. ఒమిక్రాన్ కొత్త వేరియెంట్ నేపథ్యంలో దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
కాగా,గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకరం...గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2380 మంది కరోనా బారిన పడగా..56 మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటివీ రేటు 0.53 శాతానికి పెరిగింది బుధవారం 2067 కోవిడ్ పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదైన విషయం తెలిసిందే. ఇక,గడిచిన 24 గంటల్లో 1,231 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,30,49,974కు చేరగా..మరణాల సంఖ్య 5,22,062కి చేరింది. ఇప్పటివరకు 4,25,14,479 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4.5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.