మరో 12 మంది CRPF సిబ్బందికి కరోనా.. ఒకే బెటాలియన్లో 60

మరో 12 మంది CRPF సిబ్బందికి కరోనా.. ఒకే బెటాలియన్లో 60

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

వరుస కేసుల నేపథ్యంలో 31వ బెటాలియన్ కార్యాలయాన్ని ఢిల్లీ వైద్యాధికారులు సీల్ చేశారు. సిబ్బందిని మొత్తం క్వారంటైన్ చేశారు.

 • Share this:
  CRPF(సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్)లో భారీగా కరోనా కేసులు నమోదువున్నాయి. ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-3 కేంద్రంగా పనిచేసే 31వ బెటాలియన్‌లో ఇవాళ మరో 12 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఈ బెటాలియన్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60కి చేరింది. గురువారం ఆరు కేసులు నమోదు కాగా.. వారిలో జాతీయ కబడ్డీ జట్టుకు ఆడే కబడ్డీ ప్లేయర్ ఉన్నాడు. ఇప్పటికే CRPF బెటాలియన్‌కు చెందిన కరోనా బాధితుల్లో ఒకరు మరణించారు. వరుస కేసుల నేపథ్యంలో 31వ బెటాలియన్ కార్యాలయాన్ని ఢిల్లీ వైద్యాధికారులు సీల్ చేశారు. సిబ్బందిని మొత్తం క్వారంటైన్ చేశారు. ఇక్కడి సిబ్బందికి యూనిట్ల వారీగా రోజూ పరీక్షలు చేస్తున్నారు అధికారులు.

  అటు ITBP (ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్)లోనూ కరోనా కలకలం రేగింది. శుక్రవారం ఢిల్లీలో ఐదుగురు ఐటీబీపీ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు సిబ్బంది ఢిల్లీ పోలీసులతో పాటు జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తించినట్లు తెలిసింది. దాంతో అప్రమత్తమైన అధికారులు తమ బెటాలియన్‌లో 80 మంది సిబ్బందిని క్వారంటైన్ చేశారు. వారితో దగ్గరగా మెలిగిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు