Corona Update | కరోనాపై గుడ్ న్యూస్ పంచుకున్న కేటీఆర్...

గతంలో కరోనా పాజిటివ్ బారిన పడిన వారిలో 11 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చిందని కేటీఆర్ తెలిపారు.

news18-telugu
Updated: March 29, 2020, 5:48 PM IST
Corona Update | కరోనాపై గుడ్ న్యూస్ పంచుకున్న కేటీఆర్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ తీపికబురును పంచుకున్నారు. గతంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 11 మందికి ఈ రోజు పరీక్షల్లో నెగిటివ్ అని రిపోర్టు వచ్చినట్టు తెలిపారు. ‘అందరితో పంచుకోవడానికి ఓ మంచి వార్త. తెలంగాణలో గతంలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 11 మందికి తాజాగా ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది.’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ వైద్య  ఆరోగ్య శాఖ ప్రకటించిన మేరకు రాష్ట్రంలో 67 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అందులో ఒకరు చనిపోయారు. 74 సంవత్సరాలు ఆ వృద్ధుడికి ఇతరత్రా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. దీంతోపాటు నిన్న (మార్చి 28)న నిర్వహించిన పరీక్షల్లో 10 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చినట్టు (గతంలో పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు) ఈటల రాజేందర్ తెలిపారు.

First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading