Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Vaccine: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి

Corona Vaccine: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి

ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మరణించగా, కొత్త రాంబాబు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. గుండా సంతోష్ తోపాటు కారు డ్రైవర్ సంతోష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకుని హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మరణించగా, కొత్త రాంబాబు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. గుండా సంతోష్ తోపాటు కారు డ్రైవర్ సంతోష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకుని హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

కరోనా టీకా వల్లే విఠల్ చనిపోయాడనడానికి ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదని ప్రాధమిక విచారణలో తేలినట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓ ప్రకటనలో తెలిపింది. గైడ్ లైన్స్ ప్రకారం డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది.

ఇంకా చదవండి ...

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి చనిపోయాడు. నిర్మల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిర్మల్ జిల్లా కుంటాల పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్‌లో 108 ఆంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న 42 సంవత్సరాల విఠల్ అనే వ్యక్తి 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు కరోనా టీకా తీసుకున్నారు. అయితే, 19వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (20వ తేదీ) 2.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో అతడిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. తెల్లవారుజామున 5 గంటలకు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయినట్టు జిల్లా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. కరోనా టీకా వల్లే విఠల్ చనిపోయాడని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.


అయితే, కరోనా టీకా వల్లే విఠల్ చనిపోయాడనడానికి ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదని ప్రాధమిక విచారణలో తేలినట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓ ప్రకటనలో తెలిపింది. గైడ్ లైన్స్ ప్రకారం డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది. జిల్లా AEFI కమిటీ పరీక్షించనుంది. ఆ తర్వాత ఆ కమిటీ రాష్ట్ర AEFI కమిటీకి నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాత రాష్ట్ర AEFI కమిటీ నివేదికను పరిశీలించి కేంద్ర AEFI కమిటీకి అందించనుందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓ ప్రకటనలో తెలిపింది.

నిర్మల్ జిల్లాలో హెల్త్ వర్కర్ మృతిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రారంభమైన జనవరి 16వ తేదీనే తెలంగాణలో కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో హెల్త్ కేర్ వర్కర్‌కు తొలి టీకా వేశారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. తాజాగా, జనవరి 19వ తేదీన ఒక్కరోజే 51, 997 మందికి టీకాలు వేశారు. జనవరి 16 నుంచి ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 69,625కు చేరిందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాస్ రావు తెలిపారు. వ్యాక్సినేషన్ తొలిరోజున (జనవరి 16) 140 కేంద్రాలు, రెండో రోజు (జనవరి 18)న 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. ఇక మూడో రోజు (జనవరి 19) ఏకంగా 894 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో గరిష్ఠంగా 100 టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మంగళవారం టీకా వేయించుకునేందుకు 73,673 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 71శాతం మంది టీకా వేయించుకున్నారు. అంటే మంగళవారం ఒక్కరోజే 51,997 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం టీకాలను తీసుకున్న వారిలో 51 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఐతే అందరికీ చిన్న చిన్న సమస్యలే వచ్చాయి. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు. ఆందోళన, భయం వల్లే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇది సర్వ సాధారణమని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

First published:

Tags: Corona Vaccine, Nirmal, Telangana

ఉత్తమ కథలు