హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

1918లో స్పానిష్ ఫ్లూ... 2020లో కరోనా... ఈ బామ్మ నిజంగా గ్రేట్

1918లో స్పానిష్ ఫ్లూ... 2020లో కరోనా... ఈ బామ్మ నిజంగా గ్రేట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్పెయిన్‌కు చెందిన ఓ 107 ఏళ్ల బామ్మ మాత్రం కరోనా నుంచి కోలుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహహ్మరి ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకెంతమంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి చనిపోతారో అని అంతా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ కారణంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులకే ఎక్కువ ఇబ్బంది ఉంటుందని అనేక మంది వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారిలోనూ వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. అయితే స్పెయిన్‌కు చెందిన ఓ 107 ఏళ్ల బామ్మ మాత్రం కరోనా నుంచి కోలుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అయితే ఈ బామ్మ గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అప్పట్లోనే 50 కోట్ల మంది చనిపోయి ఉంటారని చెబుతుంటారు. అయితే అప్పట్లో చిన్న పిల్లగా ఉన్న అనా డెల్ వలె అనే ఈ బామ్మ మాత్రం ఈ స్పానిష్ ఫ్లూ నుంచి కోలుకుని వందేళ్లు జీవించింది. స్పెయిన్‌లో కరోనా విజృంభించడంతో ఈ బామ్మతో పాటు ఆమె చుట్టుపక్కల ఉన్న 60 మందికి కూడా కరోనా సోకింది.

వందేళ్లు దాటిన ఈ వృద్ధురాలు బతుకుతుందని వైద్యులు కూడా ఊహించలేదు. కానీ వైద్యులను కూడా ఆశ్చర్యపరుస్తూ కరోనా నుంచి కోలుకుంది ఈ మృత్యుంజయురాలు. దీంతో ఈ బామ్మ రోండాలోని తన ఇంటికి వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా... ఆమె విషయంలో జాగ్రత్తలు అవసరమని సూచించారు. ఇక కరోనా కారణంగా స్పెయిన్‌లో ఇప్పటివరకు 22,524 మంది చనిపోయారు.

First published:

Tags: Coronavirus, Covid-19, Spain