Coronavirus: కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్దురాలు..

Coronavirus: కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్దురాలు..

ఫొటోక్రెడిట్- Twitter/DrSEShinde

కరోనా మహమ్మారి బారినపడిన వారిలో ఎక్కువగా వృద్దులే  ప్రాణాలు కోల్పోతున్నారని గణంకాలు చెబుతున్నాయి. ఇందుకు వయసు పైబడినవారికి ఇతర అనారోగ్య సమస్యలు అధికంగా ఉండటమే కారణమని చెబుతున్నారు

  • Share this:
    కరోనా మహమ్మారి బారినపడిన వారిలో ఎక్కువగా వృద్దులే  ప్రాణాలు కోల్పోతున్నారని గణంకాలు చెబుతున్నాయి. ఇందుకు వయసు పైబడినవారికి ఇతర అనారోగ్య సమస్యలు అధికంగా ఉండటమే కారణమని చెబుతున్నారు. అయితే మహారాష్ట్రలో ఓ 106 ఏళ్ల బామ్మ మాత్రం కరోనాతో ధైర్యంగా పోరాడింది. ఆస్పత్రిలో 10 రోజుల పాటు చికిత్స పొంది కరోనాను జయించింది. దీంతో ఆమె ఆస్పత్రి నుంచి డిశార్జ్ అవుతున్న సమయంలో డాక్టర్‌లు, నర్సులు ఘనంగా ఫేర్‌వెల్ పలికారు. వివరాలు.. డొంబివిలికి చెందిన 106 ఏళ్ల బామ్మకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆమెకు వయసు చాలా పెద్దది కావడంతో పలు ఆస్పత్రులు చికిత్స అందించడానికి నిరాకరించాయి. చివరకు కల్యాణ డొంబివిలికి మున్సిపల్ కార్పొరేషన్(కేడీఎంసీ) ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రంలోని వైద్యులు ఆమెకు చికిత్స అందించేందుకు ముందుకు వచ్చారు.

    వయసు ద‌ృష్ట్యా ఆమె ఆరోగ్యంపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో ఆమె పదిరోజుల్లో కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. దీంతో తన డిశ్చార్జ్ సర్ఠిఫికెట్ చూపిస్తూ ఆ వృద్దురాలు చిరునవ్వు చిందించింది. ఇక, ఆమెకు ప్రత్యే శ్రద్ధతో చికిత్స అందించిన వైద్యులకు వృద్ధురాలు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కేడీఎంసీ ఎండీ డాక్టర్ రాహుల్ ఘులే మట్లాడుతూ.. ఇక్కడ ఒక్క రూపాయికే కరోనా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. వ‌ృద్దురాలికి మెరుగైన చికిత్స అందించిన తమ వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. తాము అందించిన చికిత్సకు వృద్దురాలు ప్రతిస్పందించినందుకు ఆనందంగా ఉందన్నారు. జూలై 27న తాము ఈ ఆస్పత్రిని ప్రారంభించామని.. ఇప్పటివరకు 1,100 మంది కోవిడ్ పెషేంట్లకు చికిత్స అందించామని తెలిపారు.


    ఇక, వ‌ద్దురాలు కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్న కేడీఎంసీ సిబ్బందిని, కల్యాణ్ నియోజకవర్గపు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే సేవలను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కొనియాడారు. ఇక, ప్రపంచంలో సాధ్యం కానీది ఏది లేదని.. అందుకు ఈ వృద్దురాలు కరోనా నుంచి కోలుకుని రుజువు చేశారని.. ఎంపీ శ్రీకాంత్ షిండే ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు