ఒక్క రోజే వెయ్యికి పైగా కేసులు.. మహారాష్ట్ర కరోనా ఉగ్రరూపం..

శుక్రవారం మహారాష్ట్ర వ్యాప్తంగా 1,008 కేసులు నమోదైతే.. అందులో ఒక్క ముంబై పరిధిలోనే 751 కేసులు వచ్చాయి.

news18-telugu
Updated: May 1, 2020, 9:37 PM IST
ఒక్క రోజే వెయ్యికి పైగా కేసులు.. మహారాష్ట్ర కరోనా ఉగ్రరూపం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం భారీ మొత్తంలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,008 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ మరో 26 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటి వరకు 11,507 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 1,879 మంది కోలుకోగా.. 485 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 9,142 యాక్టివ్ కేసులున్నట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసులో అత్యధికం రాజధాని ముంబైలోనే ఉన్నాయి. శుక్రవారం మహారాష్ట్ర వ్యాప్తంగా 1,008 కేసులు నమోదైతే.. అందులో ఒక్క ముంబై పరిధిలోనే 751 కేసులు వచ్చాయి. రాష్ట్రానికి కరోనా వచ్చినప్పటి నుంచి ముంబైలో శుక్రవారమే అత్యధిక కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ్టి లెక్కలతో కలిపితే.. ముంబైలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 7,625కి చేరింది. దీన్ని బట్టి అక్కడ కరోనా తీవ్ర ఇంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాగా, శుక్రవారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1993 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 35,043 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 1,147 మరణాలు నమోదయ్యాయి. 25007 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 564 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 8889 మంది కోలుకున్నారు.
First published: May 1, 2020, 9:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading