Corona Update : ఒక్క రోజే వెయ్యి కొత్త కేసులు.. దేశంలో మరింత విస్తరిస్తున్న కరోనా..

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో కేవలం 24 గంటల్లో 1007 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఉదయం 8 గంటలకు 12,380 కేసులు ఉండగా ఈ రోజు ఉదయానికి కేసుల సంఖ్య 13,387కు చేరుకుంది.

  • Share this:
    దేశంలో కేవలం 24 గంటల్లో 1007 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఉదయం 8 గంటలకు 12,380 కేసులు ఉండగా ఈ రోజు ఉదయానికి కేసుల సంఖ్య 13,387కు చేరుకుంది. ఈ 24 గంటల్లో 23 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 11,201 ఉండగా, 437 మరణాలు చోటుచేసుకున్నాయి. 1748 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3205కు చేరుకుంది. 194 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఢిల్లీలో 1640, తమిళనాడులో 1267, రాజస్థాన్‌లో 1131, మధ్యప్రదేశ్‌లో 1120, గుజరాత్‌లో 930, ఉత్తరప్రదేశ్‌లో 805, కేరళలో 395, కర్ణాటకలో 315, జమ్మూ కశ్మీర్‌లో 314, పశ్చిమ బెంగాల్‌లో 255, హరియాణాలో 205, పంజాబ్‌లో 186, బిహార్‌లో 80, ఒడిశాలో 60, ఉత్తరాఖండ్‌లో 37, అసోంలో 35, హిమాచల్ ప్రదేశ్‌లో 35, ఛత్తీస్‌గఢ్‌లో 33, జార్ఖండ్‌లో 28, ఛండీగఢ్‌లో 21, లడఖ్‌లో 18, అండమాన్ నికోబార్ దీవుల్లో 10, గోవాలో 7, మేఘాలయాలో 7, పుదుచ్చేరిలో 7, మణిపూర్‌లో 2, త్రిపురలో 2, అరుణాచల్‌ప్రదేశ్‌లో 1, మిజోరంలో ఒక కేసు నమోదు కాగా, నాగాలాండ్‌లో ఒక్క కేసు నమోదు కాలేదు.

    ఇదిలా ఉండగా, తెలంగాణలో గురువారం ఒక్క రోజే 50 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వీటిలో 90శాతం కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని ఆయన తెలిపారు. మరో 68 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని, వారందరినీ డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700కు చేరింది. 700 కరోనా కేసుల్లో 645 మంది మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వాళ్లే ఉన్నారని మంత్రి తెలిపారు.

    ఏపీలో అనంతపురం జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులుగా మొట్ట మొదటగా నమోదైన హిందూపురానికి చెందిన మహిళ, లేపాక్షికి చెందిన బాలుడు డిశ్చార్జ్ అయ్యారు. సవేరా ఆస్పత్రి నుంచి నిన్న సాయంత్రం 6.30 గంటలకు వాళ్లను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఏపీలో నిన్నటి వరకు 534 కేసులు నమోదయ్యాయి.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: