ఏపీలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 100 మందికి కరోనా...

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్యాణి డ్యాం లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు 100 మంది శిక్షణార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

news18-telugu
Updated: August 8, 2020, 10:23 PM IST
ఏపీలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 100 మందికి కరోనా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న పోలీసులు కరోనా వైరస్ బారిన పడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్యాణి డ్యాం లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు 100 మంది శిక్షణార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ ట్రైనింగ్ సెంటర్లో 380 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 100 మందికి కరోనా సోకినట్టు తెలిసింది. దీంతో శిక్షణా కళాశాలను మూసివేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది. ఏ.రంగంపేట పంచాయతీ అధికారులు శానిటేషన్, పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

మరోవైపు చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ జైల్లో 29 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. 161 మంది ఖైదీలకు కరోనా టెస్టులు చేయగా, అందులో 29 మందికి వైరస్ సోకినట్టు తేలింది. రెండు రోజులుగా ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ‌శుక్రవారం 11 మందికి, శనివారం 18 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిని 108 అంబులెన్స్ ద్వారా చిత్తూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. రిమాండ్ పై వచ్చిన వారిని ఖైదీలతో కలిసి వుంచడంతో కరోనా కేసులు పెరిగినట్లు తెలిసింది. అసలే కరోనా రాజ్యమేలుతున్న సమయంలో ముందు జాగ్రత్తగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి గాని లేక బయట నుంచి వచ్చే రిమాండ్, శిక్ష పడిన వారిని అక్కడే 15 రోజుల పాటు విడిగా ఉంచి తర్వాత పరీక్షలు చేయాల్సిన జైలు అధికారులు వచ్చిన వారిని ముందు వున్న వారితో కలిపి వుంచడం వలన అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఇతర ఖైదీలకు కరోన సోకడం ప్రారంభమైంది. ఇటీవల పీలేరుకు చెందిన వ్వక్తి‌ రిమాండ్ పై మదనపల్లె సబ్ జైల్ రాగా అతని వల్ల మొత్తం 29 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని తెలిసింది. ఇకనైనా అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఖైదీల బంధువులు వాపోతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 8, 2020, 10:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading