హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Precaution Dose : వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయి..10 కోట్లు దాటిన కోవిడ్ ప్రికాషన్ డోసుల పంపిణీ

Precaution Dose : వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయి..10 కోట్లు దాటిన కోవిడ్ ప్రికాషన్ డోసుల పంపిణీ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Precaution Dose : కోవిడ్ వ్యాక్సినేషన్(Covid Vaccination)లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పది కోట్ల మంది ప్రజలు కోవిడ్ ప్రికాషన్ డోసు(Covid Precaution Dose)తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansuk Mandaviya) శుక్రవారం తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Precaution Dose : కోవిడ్ వ్యాక్సినేషన్(Covid Vaccination)లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పది కోట్ల మంది ప్రజలు కోవిడ్ ప్రికాషన్ డోసు(Covid Precaution Dose)తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansuk Mandaviya) శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 15న.. 18 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా ప్రికాషన్ డోసు ఇచ్చేందుకు 75 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉంది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా 75 రోజుల ప్రత్యేక డ్రైవ్ ' కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్' ప్రారంభించబడింది. "10 కోట్ల మంది అధిక రక్షణ కలిగి ఉన్నారు. అమృతమహోత్సవ్ వేళప్రధాని మోదీ సారథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది" అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం ట్వీట్‌ లో తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 205 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో 69 కోట్లకుపైగా పౌరులు ప్రికాషన్‌ డోసుకు అర్హత కలిగి ఉన్నారు. అయితే వారిలో చాలామంది ఈ డోసు వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదనే వాదనలు ఉన్నాయి. జూలై 26న, ఆరోగ్య మంత్రిత్వ శాఖ... కేవలం 7,30,96,284 మంది, అంటే దాదాపు 69 కోట్ల మంది అర్హులైన 18 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో 11 శాతం మందికి ముందురోజు వరకు ముందు జాగ్రత్త మోతాదును అందించినట్లు తెలిపింది.

Gemstone : ఏ రత్నాన్ని ఏ వేలికి ధరించాలో తెలుసుకోండి

ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఓ అధికారి మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలు ఇంకా మొదటి డోస్ తీసుకోవలసి ఉండగా, సుమారు ఏడు కోట్ల మంది ప్రజలు రెండవ డోస్‌ని తీసుకోవలసి ఉందని తెలిపారు. ప్రజల్లో కోవిడ్‌కు సంబంధించిన భయం లేదని,అర్హులైన ప్రజలు ప్రికాషన్ డోసు నెమ్మదిగా తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. మరోవైపు,భారత్​లో శుక్రవారం 32,73,551 మందికి కోవిడ్ వ్యాక్సిన్లను అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 205.92 కోట్లు దాటింది.

First published:

Tags: Corona Vaccine, Covid -19 pandemic, Covid vaccine

ఉత్తమ కథలు