హోమ్ /వార్తలు /coronavirus-latest-news /

NeoCov : గబ్బిలాల్లో మరో కొత్త వైరస్..ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారన్న వూహాన్ సైంటిస్టులు

NeoCov : గబ్బిలాల్లో మరో కొత్త వైరస్..ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారన్న వూహాన్ సైంటిస్టులు

New Corona Virus NeoCov : ప్రాణాంతకమైన మరో కొత్తరకం వేరియంట్‌ "నియో కోవ్ (NeoCoV)"ను దక్షిణాఫ్రికాలో సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కూడా ఈ వైరస్​ ను ఎదుర్కోలేవని...వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు.

ఇంకా చదవండి ...

New Coronavirus 'NeoCov'  :  కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్(Corona Virus)విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ వైరస్ తగ్గిపోతుందనుకుంటున్న సమయంలో డెల్టా వేరియంట్ రూపంలో విరుచుకుపడిన కోవిడ్ ఆ తర్వాత ఒమిక్రాన్ రూపంలో మరోసారి ప్రపంచాన్ని కలవరపాటుకి గురి చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వేరియంట్లు ఒక దాని తర్వాత ఒకటి పుట్టుకుంటూ వస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ కొత్త కొత్త మ్యుటెంట్లు మనుషుల్ని ఊపిరి తీసుకోనివ్వడం లేదు. దక్షిణాఫ్రికాలో(South Africa) వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నా.. తీవ్రత మాత్రం తక్కువగా ఉండటం ప్రపంచం ఊరట చెందుతోంది. ఈ తరుణంలో ప్రాణాంతకమైన మరో కొత్తరకం వేరియంట్‌ "నియో కోవ్ (NeoCoV)"ను దక్షిణాఫ్రికాలో సైంటిస్టులు గుర్తించారు. దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గల గబ్బిలాల్లో(Bats)ఈ "నియో కోవ్" వైరస్ బయటపడింది.

కొత్తరకం కరోనా వైరస్(New Corona Virus)"నియోకొవ్"తో పెను ప్రమాదం పొంచి ఉందని చైనాలోని వూహాన్ సైంటిస్టులు హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ 19తో పోలిస్తే నియో కోవ్ వైరస్ కాస్త భిన్నమైనదే కాగా, ప్రమాదకరమైనదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌లో ఉండే పాథోజెన్‌కు భిన్నంగా మరింత ప్రమాదకరంగా ఇది పరిణించే అవకాశాలు లేకపోలేదని సైంటిస్టులు అంచనా వేశారు. యాంటీబాడీలు లేదా ప్రొటీన్లను సైతం నియోకోవ్ నుంచి రక్షణ కల్పించలేదని,ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కూడా ఈ వైరస్​ ను ఎదుర్కోలేవని...వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు "నియో కోవ్" వైరస్ మనుషులకు సోకలేదని తెలిపారు.

ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్‌ గా గుర్తించారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్‌ కారణంగా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. చైనీస్ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​లోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బయోఫిజిక్స్​తో కలిసి వుహాన్​ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం బయోఆర్​షివ్​లో ప్రచురితమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్​ రివ్యూ చేయలేదు. నియో కోవ్ వైరస్ కొత్తదేమీ కాదని...2012, 2015లో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్స్-కోవ్​కు, నియోకొవ్​కు సంబంధం ఉందని వూహాన్ సైంటిస్టులు తెలిపారు. వూహాన్ ల్యాబ్ సైంటిస్టుల(Wuhan Scintists)హెచ్చరికలు ప్రపంచాన్ని మరోసారి భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

ఇక, వూహాన్ సైంటిస్టుల అధ్యయనంపై వెక్టార్‌ రష్యన్​ స్టేట్‌ రీసర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీ నిపుణులు స్పందించారు. నియో కోవ్ ​పై చైనా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయన ఫలితాలు తమకు కూడా తెలుసన్నారు. అయితే ఇది మనుషులకు సోకుతుందా అనేదానిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని, మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు.

First published:

ఉత్తమ కథలు