హోమ్ /వార్తలు /బిజినెస్ /

Zomato 10 minutes Delivery: జొమాటో 10 మినిట్స్ డెలివరీపై ఎదురుదెబ్బ... వివరణ ఇచ్చిన కంపెనీ

Zomato 10 minutes Delivery: జొమాటో 10 మినిట్స్ డెలివరీపై ఎదురుదెబ్బ... వివరణ ఇచ్చిన కంపెనీ

Zomato 10 minutes Delivery | జొమాటో 10 మినిట్ డెలివరీ కాన్సెప్ట్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అంతకన్నా ముందే ఈ కాన్సెప్ట్‌కు ఎదురుదెబ్బ తగుల్తోంది. సోషల్ మీడియాలో (Social Media) ఈ కాన్సెప్ట్‌పై వ్యతిరేకత వస్తుండటంతో కంపెనీ వివరణ ఇచ్చింది.

ఇంకా చదవండి ...

కేవలం 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తామని జొమాటో ప్రకటించడం సంచలనంగా మారింది. కేవలం 10 నిమిషాల్లో ఫుడ్ ఎలా డెలివరీ చేస్తారన్న చర్చ మొదలైంది. అంతేకాదు... వేగంగా ఫుడ్ డెలివరీ చేయాలన్న టార్గెట్‌తో డెలివరీ ఏజెంట్ల భద్రతకు ముప్పు ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. డెలివరీ పార్ట్‌నర్స్‌ని సురక్షితం కాని పని వాతావరణంలోకి నెట్టేస్తున్నారని నెటిజన్లు ఆరోపించారు. దీంతో కంపెనీ వివరణ ఇచ్చింది. జొమాటో 10 మినిట్స్ డెలివరీ (Zomato 10 minutes Delivery) కాన్సెప్ట్ గురించి కంపెనీ ఫౌండర్ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే కాన్సెప్ట్‌పై పలు వర్గాల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తమ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందో వివరణ ఇచ్చారు.

జొమాటో కేవలం ఎంపిక చేసిన ఫుడ్ ఐటెమ్స్‌ని ఎంపిక చేసిన కస్టమర్ లొకేషన్లలో మాత్రమే 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుందని దీపిందర్ గోయల్ తెలిపారు. తక్కువ సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసే తొందరలో తమకు మంచి నాణ్యత గల ఆహారం దొరకకపోవచ్చని సోషల్ మీడియాలో వస్తున్న వాదనకు ఆయన వివరణ ఇచ్చారు. డెలివరీ ఏజెంట్ల భద్రత, ఆహార నాణ్యత లాంటి విషయాల్లో రాజీపడబోమని జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ వివరించారు.

iQOO Z6: కాసేపట్లో ఐకూ జెడ్6... వారికి రూ.2,000 డిస్కౌంట్

డెలివరీ చేయాల్సిన ఆర్డర్ 10 మినిట్స్ డెలివరీనా లేదా 30 మినిట్స్ డెలివరీనా అన్న విషయాన్ని జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌కు తాము చెప్పట్లేదని, ఆలస్యంగా డెలివరీ చేస్తే జరిమానాలు ఉండవని, అలాగని 10 నిమిషాల్లో లేదా 30 నిమిషాల్లో డెలివరీ చేసినా ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండవని, కాబట్టి డెలివరీ పార్ట్‌నర్స్‌పై ఒత్తిడి ఉండదని తెలిపారు. బ్రెడ్, ఆమ్లెట్, పోహా, కాఫీ, ఛాయ్, బిర్యానీ, మోమోస్ లాంటివాటిని 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామన్నారు.

Redmi K50 Series: హైఎండ్ ఫీచర్స్‌తో రెడ్‌మీ కే50 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు... 19 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్

ఫినిషింగ్ స్టేషన్లలో తమ బెస్ట్ సెల్లర్ ఐటెమ్స్, 20 నుంచి 30 డిషెస్ సిద్ధంగా ఉంటాయని, తమ పార్ట్‌నర్ బేస్డ్ రెస్టారెంట్స్ నుంచి వాటిని తీసుకొచ్చి సిద్ధంగా ఉంటామని, ఇవన్నీ తాము ఊహించి సిద్ధంగా ఉంచే డిషెస్ అని తెలిపారు. ఇవి కస్టమర్లు ఆర్డర్ చేయగానే 10 మినిట్ మోడల్‌లో కేవలం 10 నిమిషాల్లోనే దగ్గర్లో ఉన్న కస్టమర్లకు డెలివరీ చేస్తామన్నారు. జొమాటో ఇన్‌స్టంట్ పేరుతో ప్రారంభిస్తున్న ఈ సర్వీస్ ఏప్రిల్ నుంచి గురుగ్రామ్‌లోని నాలుగు స్టేషన్లలో పైలట్ పద్ధతిన ప్రారంభం కానుంది. జొమాటో ఇటీవల 10 మినిట్ డెలివరీ కోసం బ్లింకిట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

First published:

Tags: Food delivery, Zomato

ఉత్తమ కథలు