హోమ్ /వార్తలు /బిజినెస్ /

Zomato: హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసిన ఢిల్లీ కస్టమర్‌కు షాక్

Zomato: హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసిన ఢిల్లీ కస్టమర్‌కు షాక్

Zomato: హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసిన ఢిల్లీ కస్టమర్‌కు షాక్
(ప్రతీకాత్మక చిత్రం)

Zomato: హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసిన ఢిల్లీ కస్టమర్‌కు షాక్ (ప్రతీకాత్మక చిత్రం)

Zomato | ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒక పార్శిల్ బదులు మరొకటి రావడం లేదా ఎక్స్‌ట్రా ప్యాకెట్ రావడం లేదా ఫుడ్ మిస్ కావడం మామూలే. హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి బిర్యానీ పార్శిల్‌లో బిర్యానీ మిస్ అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

జొమాటో ఇటీవల 'ఇంటర్‌సిటీ లెజెండ్స్' (Intercity Legends) పేరుతో కొత్త సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోని ఏ ప్రాంతంలోని ప్రముఖ ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి తెప్పించుకోవడానికి ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. హైదరాబాద్ బిర్యానీ (Hyderabad Biryani), కోల్‌కతా రసగుల్లా, లక్నో కబాబ్స్, బెంగళూరు మైసూర్ పాక్... ఇలా ఒక ప్రాంతంలో ఫేమస్ అయిన ఫుడ్‌ని మరో నగరంలో ఉన్నవారు ఆర్డర్ తెప్పించుకోవచ్చు. వారం క్రితం ప్రారంభమైన ఈ సర్వీస్‌ను జొమాటో కస్టమర్లు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ సర్వీస్ ద్వారా ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తే పార్శిల్ వచ్చింది. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్.

గురుగ్రామ్‌‌లోని న్యూగ్లోబల్ సంస్థలో డైరెక్టర్ ఆఫ్ పాలసీ అండ్ అడ్వకసీ హోదాలో పనిచేస్తున్న ప్రతీక్ కన్వాల్ జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ ద్వారా హైదరాబాద్‌లోని షాదాబ్ హోటల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కొన్ని గంటల్లోనే పార్శిల్ వచ్చేసింది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో బిర్యానీ లేదు. బిర్యానీతో పాటు ఇచ్చే సాలన్ మాత్రమే ఉంది. దీంతో సదరు కస్టమర్ షాకయ్యాడు. జొమాటో కస్టమర్‌గా, జొమాటో షేర్ హోల్డర్‌గా తనకు డబుల్ లాస్ అయిందని, ఈ సమస్యను పరిష్కరించాలని, జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. తన డిన్నర్ ప్లాన్స్ గాల్లో కలిసిపోయాయని, ఇప్పుడు తనకు గుర్గావ్‌లో బిర్యానీ కావాలని ట్వీట్ చేశాడు. ఫోటోలు కూడా షేర్ చేశాడు.

Voter ID Aadhaar Link: ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఈ సింపుల్ స్టెప్స్‌తో చేయండి

వెంటనే జొమాటో సిబ్బంది రంగంలోకి దిగి సదరు కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ పార్శిల్ ఎక్కడ మిస్ అయిందో ట్రాక్ చేశారు. ఆ బిర్యానీతో పాటు, బిర్యానీ బై కిలో నుంచి మరో పార్శిల్ కూడా పంపించారు. దీంతో ప్రతీక్ కన్వాల్ మళ్లీ ఓ ట్వీట్ చేశారు. జొమాటో టీమ్ తన పార్శిల్‌ను ట్రాక్ చేయడంతో పాటు, అదనంగా బిర్యానీ పంపించారని ఫోటోలు పోస్ట్ చేశారు.

Vande Bharat Express: ఫెస్టివల్ సీజన్‌లో మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్... రూట్ ఇదే

జొమాటో ఇటీవల ఇంటర్‌సిటీ ఫుడ్ డెలివరీ ప్రారంభించింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లోని ఐకానిక్ డిషెస్‌ని దేశంలోని ఎక్కడి కస్టమర్లకైనా అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. జొమాటో యాప్‌లో ఇంటర్‌సిటీ లెజెండ్స్ పేరుతో ఉన్న ఆప్షన్‌లోకి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలు. కస్టమర్లు కోరుకున్న స్పెషల్ ఫుడ్ మీరు కోరుకున్న అడ్రస్‌కు వస్తుంది.

హైదరాబాద్ బిర్యానీ, కోల్‌కతా రసగుల్లా, లక్నో కబాబ్స్, బెంగళూరు మైసూర్ పాక్, ఓల్డ్ ఢిల్లీ బటర్ చికన్, జైపూర్ ప్యాజ్ కచోరీ... ఇలా ఏ ప్రాంతంలోని విశిష్టమైన ఆహారాన్నైనా జొమాటో కస్టమర్లు తాము ఉన్నచోటికే తెప్పించుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Food delivery, Hyderabad biryani, Zomato

ఉత్తమ కథలు