ప్లాస్టిక్ (Plastic) వస్తువులు పర్యావరణాని(Environment)కి ఎంతో హాని కలిగిస్తాయి. కానీ చాలామంది ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా ఉండలేకపోతున్నారు. ఇక హోటల్స్(Hotels), రెస్టారెంట్స్ (Restaurants), చివరికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ (Online Food Delivery) సంస్థలు సైతం ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తున్నాయి. అయితే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత డిఫాల్ట్ మోడ్(default mode)ని చేంజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న జొమాటో.. ఇక నుంచి అవసరమైతేనే కట్లరీ(ప్లాస్టిక్ స్పూన్లు, ఫొర్క్స్) "ఆప్ట్-ఇన్" చేయాల్సిందిగా కస్టమర్లను కోరింది. వాడి పడేసే ప్లాస్టిక్ కట్లరీ అవసరం లేకపోతే "ఆప్ట్-అవుట్" చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త మార్పు గురించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు. జొమాటో యాప్‌లో ఆర్డర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ స్పూన్లు, ఫొర్క్స్ వద్దనుకున్న ప్రతిసారి వాటిని స్కిప్ చేయొచ్చని దీపిందర్ తెలిపారు.
ఆర్డర్ చేసేటప్పుడే ఆప్షన్..
అయితే ఇకపై ఆర్డర్ పెట్టేటప్పుడు జొమాటో అప్లికేషన్(Zomato Offer).. 'మీకు కట్లరీ అవసరమా లేదా' అని అడుగుతుందట. ఒకవేళ కస్టమర్లు కట్లరీ కావాలనుకుంటే తప్పకుండా "ఆప్ట్-ఇన్" ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆప్ట్-అవుట్ ఆప్షన్‌ని ‘డిఫాల్ట్’గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే 50 శాతం యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దాంతో వారు ఇకపై కట్లరీ, టిష్యూలు, స్ట్రా, ఇతర ప్లాస్టిక్ సామాగ్రి కావాలనుకుంటే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
డెలివరీ ఉమెన్‌ల నియామకంపై Zomato దృష్టి.. మహిళా ప్రాతినిధ్యం పెంచుతామంటున్న సంస్థ
రెస్టారెంట్లకు కూడా లభమే..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్ల డిఫాల్ట్ డెలివరీని ఆపివేయడం ద్వారా కంపెనీ ఒక రోజులోనే 5,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఆదా చేయగలదని గోయల్ వివరించారు. ఈ డిఫాల్ట్ చేంజ్ తో తమ రెస్టారెంట్(Restaurants) భాగస్వాములకు ప్రతి ఆర్డర్‌పై రూ.2-5 వరకు మిగులుతుందని కంపెనీ చెప్పుకొచ్చింది. ప్రతి ఆర్డర్‌పై మిగిలే డబ్బులతో ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగును ప్రారంభించాలని తమ రెస్టారెంట్ భాగస్వాములను జొమాటో కోరింది.
Zomato: జొమాటో బంపర్ ఆఫర్.. అన్ లిమిటెడ్ ఫ్రీ డెలివరీస్
నిజానికి ఈ నిర్ణయం తీసుకోక ముందు జొమాటో కంపెనీ సర్వే నిర్వహించి తమ వేలాది మంది కస్టమర్‌ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే ఆ సర్వేలో 90% మంది కస్టమర్లు తమ ఆర్డర్‌లతో పాటు ప్లాస్టిక్ కట్లరీ డెలివరీ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. దాంతో సదరు కంపెనీ కట్లరీ డిఫాల్ట్ మోడ్‌ని మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు కస్టమర్లు అవసరమైతే కట్లరీ, టిష్యూలు, స్ట్రాస్ కోసం ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్తగా తీసుకొచ్చిన మార్పుతో ఏవైనా సమస్యలు ఎదురైతే పోర్ట్ డెలివరీ ప్రాంతంలో ఫీడ్‌బ్యాక్ షేర్ చేయవలసిందిగా జొమాటో కస్టమర్లకు సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.