Zomato : జొమాటో‌కు వింత అనుభవం...ఆర్డర్ క్యాన్సిల్ చేసిన కస్టమర్...కారణం తెలిస్తే షాకవుతారు...

Zomato : కస్టమర్ నుంచి ఊహించని రిక్వెస్ట్ రావడంతో జొమాటో అవాక్కయింది. జొమాటో ఫుడ్ డెలివరీ కోసం కేటాయించిన రైడర్ మతంతో తాను విభేధిస్తున్నానని, వెంటనే వేరే వ్యక్తితో ఫుడ్ డెలివరీ చేయించాలని కోరాడు.

news18-telugu
Updated: July 31, 2019, 2:01 PM IST
Zomato : జొమాటో‌కు వింత అనుభవం...ఆర్డర్ క్యాన్సిల్ చేసిన కస్టమర్...కారణం తెలిస్తే షాకవుతారు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 31, 2019, 2:01 PM IST
ఫుడ్ సర్వీస్ యాప్ జొమోటోకు వింత అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ వ్యక్తి జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే ఫుడ్ సర్వ్ చేసేందుకు రైడర్ సిద్ధంగా ఉన్నాడని అతని వివరాలు పేర్కొంటూ, జొమాటో సదరు కస్టమర్‌కు రిప్లై ఇచ్చింది. దీనికి కస్టమర్ నుంచి ఊహించని రిక్వెస్ట్ రావడంతో జొమాటో అవాక్కయింది. జొమాటో ఫుడ్ డెలివరీ కోసం కేటాయించిన రైడర్ మతంతో తాను విభేధిస్తున్నానని, వెంటనే వేరే వ్యక్తితో ఫుడ్ డెలివరీ చేయించాలని కోరాడు. దీనికి జొమాటో స్పందించలేదు. అతడు ఫుడ్ క్యాన్సిల్ చేయడంతో ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది. అయితే డబ్బులు మాత్రం రీఫండ్ చేయలేదు. దీంతో సదరు కస్టమర్ ట్విట్టర్ వేదికగా జొమాటోను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి జొమాటో స్పందిస్తూ ఆహారానికి మతం లేదంటూ రీట్వీట్ చేసింది. అయితే కొందరు కస్టమర్ చేసిన పనిని మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు జొమాటో చేసిన పనికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

 





First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...