హోమ్ /వార్తలు /బిజినెస్ /

Zerodha: ఉద్యోగులకు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌.. రూ.10 లక్షలు, ఒక నెల శాలరీ బోనస్‌ గెలుచుకునే అవకాశం..

Zerodha: ఉద్యోగులకు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌.. రూ.10 లక్షలు, ఒక నెల శాలరీ బోనస్‌ గెలుచుకునే అవకాశం..

Zerodha: ఉద్యోగులకు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌.. రూ.10 లక్షలు, ఒక నెల శాలరీ బోనస్‌ గెలుచుకునే అవకాశం..

Zerodha: ఉద్యోగులకు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌.. రూ.10 లక్షలు, ఒక నెల శాలరీ బోనస్‌ గెలుచుకునే అవకాశం..

Zerodha: ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ లాంచ్ చేసింది Zerodha. ఇందులో విజయం సాధించిన వారికి క్యాష్‌ ప్రైజ్ అందించనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కరోనా (Covid-19) సమయంలో దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. పాఠశాలలు, ఆఫీసులు మూతబడటంతో ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రమ్‌ హోం పద్ధతులు వచ్చాయి. ఈ మార్పులతో చాలా మంది మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఎక్కువ మందిని ప్రభావితం చేసిన సమస్య బరువు పెరగడం (Weight Gain). శారీరక శ్రమ తగ్గడం ఇంట్లోనే కూర్చుని పని చేయడం, తినడం ద్వారా చాలా మంది బరువు పెరిగారు. ఈ క్రమంలో తమ ఉద్యోగులను ఫిట్‌గా మార్చేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ బ్రోకింగ్‌ సంస్థ జెరోధా (Zerodha) చొరవ తీసుకుంది. ఇందుకు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ లాంచ్ చేసింది. ఇందులో విజయం సాధించిన వారికి క్యాష్‌ ప్రైజ్ అందించనుంది.

* రూ.10 లక్షల లక్కీ డ్రా

జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తమ ఉద్యోగుల కోసం ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్ కింద.. ఉద్యోగులు రూ.10 లక్షల వరకు లక్కీ డ్రా, ఒక నెల జీతం బోనస్‌గా పొందుతారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలను నితిన్ కామత్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

డైలీ ఫిజికల్ యాక్టివిటీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని నితిన్ కామత్ ఉద్యోగులను కోరారు. ఈ ప్రోగ్రామ్ కింద ఉద్యోగి ప్రతిరోజూ కనీసం 350 యాక్టివ్ కేలరీలను బర్న్ చేయాలి. వచ్చే ఏడాది నాటికి ఈ లక్ష్యంలో 90 శాతం వరకు ఎవరు రీచ్ అయితే.. వారికి బోనస్‌గా ఒక నెల జీతం ఇస్తామని కామత్ పేర్కొన్నారు.

అంతే కాకుండా ఓ ఉద్యోగికి రూ.10 లక్షల లక్కీ డ్రాను గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది ఆప్షనల్‌ ప్రోగ్రామ్ అని నితిన్ తెలిపారు. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నారని, కూర్చొని ధూమపానం చేసే అలవాటు నిరంతరం పెరుగుతోందని, టీంను యాక్టివేట్‌ చేయడానికి ఛాలెంజ్‌ తీసుకొచ్చామని కామత్‌ వివరించారు.

ఇది కూాడా చదవండి : మారుమూల గ్రామానికి మొదటిసారి గ్యాస్ కనెక్షన్స్.. సంబరాలు చేసుకుంటున్న ప్రజలు..

* ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌తో బరువు తగ్గిన కామత్‌

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రతిరోజూ 1000 కేలరీలు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నితిన్ కామత్ పోస్ట్ చేశారు. కరోనా సమయంలో బరువు పెరిగానని, అయితే ఫిట్‌నెస్‌ గోల్స్ పూర్తి చేసి బరువు తగ్గించుకున్నానని చెప్పారు. దీనికి ముందు కూడా నితిన్ కామత్ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్ చేశారు. గత సంవత్సరం కామత్ 12 నెలల గెట్-హెల్తీ గోల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

First published:

Tags: Fitness, Life Style, Weight gain, Work from office