Home /News /business /

Salary Bonus: ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే ఒక నెల జీతం బోనస్... రూ.10,00,000 గెలుచుకునే ఛాన్స్

Salary Bonus: ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే ఒక నెల జీతం బోనస్... రూ.10,00,000 గెలుచుకునే ఛాన్స్

Salary Bonus: ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే ఒక నెల జీతం బోనస్... రూ.10,00,000 గెలుచుకునే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Salary Bonus: ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే ఒక నెల జీతం బోనస్... రూ.10,00,000 గెలుచుకునే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Salary Reward | కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఆరోగ్యంగా (Health) ఉండాలి. ఫిట్‌నెస్ (Fitness) మెయింటైన్ చేస్తే కోవిడ్‌ను ఎదుర్కోవడం మాత్రమే కాదు ఒక నెల జీతం బోనస్‌గా పొందొచ్చు. రూ.10,00,000 గెలుచుకోవచ్చు. ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఇస్తున్న ఆఫర్ ఇది.

ఇంకా చదవండి ...
    కరోనా వైరస్ మహమ్మారి ప్రజల లైఫ్‌స్టైల్‌ను మార్చేసింది. డబ్బు సంపాదన కన్నా ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలన్న స్పృహను పెంచింది. అందుకే అందరూ ఫిట్‌నెస్‌పై (Fitness) దృష్టిపెట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) కూడా కొన్ని రోజులే ఉంటుందనుకున్నా... ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంతో ఫిట్‌నెస్ కాపాడుకోవడం సవాలుగా మారింది. దీంతో కంపెనీలు తమ ఉద్యోగులు ఫిట్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం కోసం పలు రకాల కార్యక్రమాలను (Fitness Programmes) ప్రకటిస్తున్నాయి. స్టార్టప్ అయిన జిరోధా బ్రోకింగ్ లిమిటెడ్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. తమ ఉద్యోగుల ఆరోగ్యం కోసం కొన్ని రివార్డ్స్ ప్రకటించింది. ఉద్యోగుల ఫిట్‌నెస్ కోసం తాము ఏమేం చేస్తున్నామో జిరోధా ఫౌండర్ నితిన్ కామత్ ట్వీట్స్ ద్వారా వివరించారు.

    IRCTC Ticket Booking: రైలు ప్రయాణికులకు అలర్ట్... టికెట్ బుక్ చేయాలంటే ఈ వివరాలు ఇవ్వాల్సిందే


    ఉద్యోగులకు వర్క్ టార్గెట్స్‌తో పాటు హెల్త్ టార్గెట్స్ కూడా ఇస్తోంది జిరోధా. 12 నెలల హెల్త్ టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలని, ప్రతీ నెలా ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి పురోగతి సాధిస్తున్నారో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని కోరింది. ఈ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో ఉద్యోగులు చురుగ్గా పాల్గొనేలా రివార్డ్స్ ప్రకటించినట్టు జిరోధా ఫౌండర్ నితిన్ కామత్ తెలిపారు. హెల్త్ టార్గెట్ విజయవంతంగా పూర్తి చేసి, ఫిట్‌నెస్‌తో ఉంటే వారికి ఒక నెల జీతం బోనస్‌గా ఇస్తామని తెలిపారు. అంతే కాదు... టార్గెట్ రీచ్ అయినవారందరికీ లక్కీ డ్రా నిర్వహించి గెలుపొందినవారికి రూ.10,00,000 ఇస్తామన్నారు. నితిన్ కామత్ ఐడియాకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. జిరోధా నిర్వహిస్తున్న ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ ప్రశంసల్ని అందుకుంటోంది.

    New Rules in September: సెప్టెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన 7 కొత్త రూల్స్ ఇవే






    జిరోధా ప్రకటించిన ఈ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని నితిన్ కామత్ వివరించారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న వారి రిజల్ట్స్ కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయని, తమ ఉద్యోగుల పనితీరు మెరుగుపర్చేందుకు ఇది ఉపయోగపడుతోందని తెలిపారు. ఫలితాలు పాజిటీవ్‌గా వస్తుండటంతో ఈ ప్రోగ్రామ్‌ను ఇకపై కూడా కొనసాగిస్తామన్నారు. ఇతర ఆంట్రప్రెన్యూర్స్ కూడా ఇదే ఐడియా ఫాలో అయ్యేలా కొన్ని స్టోరీస్ షేర్ చేస్తామన్నారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Fitness, Health, Startups, Work From Home

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు