హోమ్ /వార్తలు /బిజినెస్ /

Zero-Cost Term Plans: జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి..? వీటి ప్రత్యేకతలు, ఫీచర్లు తెలుసుకోండి..

Zero-Cost Term Plans: జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి..? వీటి ప్రత్యేకతలు, ఫీచర్లు తెలుసుకోండి..

Health Insurance

Health Insurance

ప్రస్తుతం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో టర్మ్, లైఫ్ ప్రొడక్ట్స్ కొత్త రూపంలో లాంచ్ అవుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. విభిన్న ఫీచర్లతో నిర్దిష్ట అవసరాలు తీర్చే ఈ పాలసీలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇలాంటి కేటగిరీకి చెందినవే జీరో కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్స్‌

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రస్తుతం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో (Insurance Industry) టర్మ్, లైఫ్ ప్రొడక్ట్స్ కొత్త రూపంలో లాంచ్ అవుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. విభిన్న ఫీచర్లతో నిర్దిష్ట అవసరాలు తీర్చే ఈ పాలసీలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇలాంటి కేటగిరీకి చెందినవే జీరో కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్స్‌ (Zero-Cost Term Plans). ఇప్పటి వరకు మార్కెట్లో రెండు రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు (Term Insurance Plan) అందుబాటులో ఉన్నాయి. వీటిలో జనరల్‌ టర్మ్‌ పాలసీ ఒకటి. దీన్ని ఎంచుకున్న పాలసీదారులు పాలసీ వ్యవధిలో మరణిస్తే, నామినీకి రావాల్సిన పరిహారం అందుతుంది. ఇదే వ్యవధి ముగిసే వరకు వారు జీవించి ఉంటే, చివర్లో ఎలాంటి మొత్తం లభించదు. ఇక రెండోది రిటర్న్ ఆఫ్ ప్రీమియం(RoP) టర్మ్ ప్లాన్. ఇందులో పాలసీదారులు పాలసీ టర్మ్‌ను పూర్తిచేస్తే, వారు చెల్లించిన అన్ని ప్రీమియంలను తిరిగి పొందుతారు. అయితే ప్యూర్ టర్మ్ ప్లాన్‌ల కంటే RoP ప్లాన్‌లకు రెండింతలు ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుంది. కానీ వీటికి భిన్నంగా జీరో కాస్ట్ టర్మ్‌ ప్లాన్‌లు కొత్త రకం ఫీచర్లను అందిస్తున్నాయి.

జీరో కాస్ట్ టర్మ్‌ ప్లాన్‌ కింద పాలసీదారులు ఎప్పుడైనా తమ పాలసీని నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఏ సమయంలోనైనా ప్రీమియంలు చెల్లించడం మానేయవచ్చు. ఇవి జనరల్‌ టర్మ్ పాలసీల కంటే ఖరీదైనవి కూడా కావు. పాలసీని నిలిపివేసిన తర్వాత, కస్టమర్ అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలను జీఎస్‌టీ మినహాయించి అందజేస్తారు. వీటి గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏవో చూద్దాం.

LIC New Pension Plus Plan: ఎల్‌ఐసీ న్యూ పెన్షన్‌ ప్లస్‌ ప్లాన్‌ లాంచ్‌.. ప్రీమియం, ఫండ్స్‌, ప్లాన్ రూల్స్ ఇవే..

ఏయే కంపెనీలు అందిస్తున్నాయి?

ప్రస్తుతం ఈ ప్లాన్‌లను బజాజ్, మ్యాక్స్ కంపెనీలు అందిస్తున్నాయి. ఇతర బీమా సంస్థలు అనుమతుల కోసం దాఖలు చేశాయి. ఈ ప్లాన్లను 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కస్టమర్‌లు కొనుగోలు చేయవచ్చు.

ఎందుకు ప్రత్యేకం?

మార్కెట్లో జనరల్ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ, రిటర్న్ ఆఫ్ ప్రీమియం(RoP) టర్మ్ ప్లాన్ అందుబాటులో ఉన్నాయి. RoP ప్లాన్‌లు జనలర్‌ టర్మ్ ప్లాన్ ప్రీమియం కంటే సుమారు రెండింతలు ఎక్కువగా ఉంటాయని Policybazaar.comలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ సజ్జా ప్రవీణ్ చౌదరి సీఎన్‌బీసీకి తెలిపారు. కానీ జీరో-టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కొత్త కేటగిరీ ప్లాన్. ఇందులో పాలసీదారుడు తమకు నచ్చినంత కాలం పాలసీని కొనసాగించవచ్చు. కోరుకున్నప్పుడు ప్లాన్‌ను మూసివేయమని సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయవచ్చు. కంపెనీ అప్పటి వరకు చెల్లించిన అన్ని ప్రీమియంలను తిరిగి ఇస్తుందని చౌదరి చెప్పారు. ఈ ప్లాన్ల ప్రీమియంలు జనరల్‌ టర్మ్ ప్లాన్‌ల మాదిరిగానే ఉంటాయి. TROPల తరహాల ఖరీదైనవి కావని చౌదరి చెప్పారు.

ప్రత్యేకతలు

సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి బయటకు వచ్చినప్పుడు పాలసీదారులకు ఎలాంటి ప్రయోజనం అందదు. ఈ అంశంలో జీరో-కాస్ట్ టర్మ్ ప్లాన్‌లు ఉపయోగపడతాయని PolicyX వ్యవస్థాపకుడు, సీఈవో నావల్ గోయెల్ తెలిపారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: General insurance, Insurance

ఉత్తమ కథలు