Electric Car | ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. చాలా కంపెనీలు ఈ విభాగంలో కొత్త కొత్త మోడళ్లు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మన దేశంలో ఎలక్ట్రిక్ కారు (Electric Vehicle) విభాగంలో టాటా మోటార్స్ (Tata Motors) దూసుకుపోతోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కంపెనీ 50 వేల ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసింది. అయితే ఇప్పుడు మనం ఒక అదిరిపోయే ఎలక్ట్రిక్ లగ్జరీ కారు గురించి తెలుసుకోబోతున్నాం.
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ జీక్ర్ తాజాగా మోస్ట్ లగ్జరియస్ ఎంపీవీ కారును లాంచ్ చేసింది. కంపెనీ నుంచి వస్తున్న రెండో లేటెస్ట్ లగ్జరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. దీని పేరు జీక్ర్ 009. ఈ లార్జ్ లగ్జరీ ఎంపీవీ 009 మినీ వ్యాన్ పొడవు 5209 ఎంఎంగా, విడ్త్ 2024 ఎంఎంగా ఉంది. వీల్ బేస్ 3205 ఎంఎం.
భారీ తగ్గింపు ఆఫర్లు.. కారు కొంటే ఏకంగా రూ.63,000 డిస్కౌంట్!
ఈ కారులో రెండు, మూడో వరుసలో 2+ 2 కెప్టెన్ సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ కారులో ఆరు మంది ప్రయాణం చేయొచ్చు. ఈ కారు బరువు 2830 కేజీలు. అయినా కూడా స్పీడ్లో మాత్రం ఈ కారు తగ్గేదేలే అంటోంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. ఈ కారులో డ్యూయెల్ మోటార్ ఉంటుంది. దీని టార్క్ 686 ఎన్ఎం. పవర్ 536 బీహెచ్పీ.
కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. టాటా కార్లపై భారీ డిస్కౌంట్!
Reengineering luxury, Redefining MPV. Meet ZEEKR 009, the world's first pure electric luxury MPV! pic.twitter.com/N4em3iUOt0
— Geely Group (@GeelyGroup) November 2, 2022
ఈ కారులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఈ కారు రేంజ్ 702 కిలోమీటర్లు. 116 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్న కారుకు ఇది వర్తిస్తుంది. అదే 140 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్న కారు అయితే రేంజ్ 822 కిలోమీటర్లు. అంటే మీరు ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఈ కారు ముంబై వెళ్తుంది. షిర్డీ కూడా చూడొచ్చు.
కారు లోపలి భాగంలో 10.4 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది. అంతేకాకుండా 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. దీని ద్వారా కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడొచ్చు. ఇంకా ఏఐ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ ఉంటుంది. 20 వట్ యమహా ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ కారులో ఏడు 8 ఎంపీ హెచ్డీ కెమెరాలు, నాలుగు 2 ఎంపీ 360 డిగ్రీ కెమెరాలు ఉంటాయి. అంటే ఈ కారు ఏ రేంజ్లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. దీని ధర 68,340 డాలర్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cars, Electric cars, Electric Vehicle, Tata cars, Tata Motors