Home /News /business /

ZEE ENTERTAINMENT ANNOUNCED ZEE5 CLUB PLAN WITH RS 365 KNOW BENEFITS SS

Zee5 Club: తక్కువ ధరకే జీ5 నుంచి సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్

Zee5 Club: తక్కువ ధరకే జీ5 నుంచి సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్
(ప్రతీకాత్మక చిత్రం)

Zee5 Club: తక్కువ ధరకే జీ5 నుంచి సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ (ప్రతీకాత్మక చిత్రం)

Zee5 Club | మీరు జీ5 సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? జీ5 క్లబ్ పేరుతో కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. వివరాలు తెలుసుకోండి.

    కరోనా వైరస్ సంక్షోభకాలంలో సినిమా థియేటర్లు తెరుచుకోవట్లేదు కాబట్టి ఓటీటీలదే హవా. అందుకే కంపెనీలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొత్తకొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించింది. జీ5 క్లబ్ పేరుతో ఏడాదికి రూ.365 ధరతో ఈ కొత్త ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి జీ5, ఆల్ట్ బాలాజీ షోస్‌తో పాటు 1000 సినిమాలు, జీ జిందగీ షోస్, 90 లైవ్ ఛానెళ్లు చూడొచ్చు. ప్రస్త్తుతం ఉన్న జీ5 యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కన్నా జీ5 క్లబ్ ప్లాన్ ధర తక్కువ. జీ5 యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే రూ.999 చెల్లించాలి. ఇది ఆల్ యాక్సెస్ ప్లాన్. నెలకు రూ.99, మూడు నెలలకు రూ.299, ఆరు నెలలకు రూ.599 ప్లాన్స్ కూడా ఉన్నాయి. జీ5 ఆల్ యాక్సెస్ ప్లాన్‌లో జీ5 ఎక్స్‌క్లూజీవ్స్ చూడొచ్చు.

    TRAI New Rules: తక్కువ ధరకే ఎక్కువ ఛానెల్స్... ట్రాయ్ కొత్త రూల్స్ ఇవే

    Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... ట్రైన్ ఎక్కాలంటే ఈ 9 పాయింట్స్ పాటించాల్సిందే

    జీ5 క్లబ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర ఏడాదికి రూ.365 మాత్రమే. ఇది డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ లాంటిది. ఆల్ యాక్సెస్ ప్లాన్‌తో పోలిస్తే ఇందులో కంటెంట్ కాస్త తక్కువ లభిస్తుంది. కేవలం రీజనల్ కంటెంట్ చూడాలనుకునేవారు జీ క్లబ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. జీ5 క్లబ్, జీ5 ఆల్ యాక్సెస్ ప్లాన్స్ తీసుకున్నవారు ఒకేసారి 5 డివైజ్‌లలో కంటెంట్ చూడొచ్చు. జీ5 క్లబ్ సబ్‌స్క్రైబర్లు ఎప్పుడైనా ఆల్ యాక్సెస్ ప్లాన్‌కు మారొచ్చు. ఇందుకోసం రూ.999 చెల్లించాల్సిన అవసరం లేదు. ముందే రూ.365 చెల్లిస్తారు కాబట్టి మిగతా మొత్తాన్ని పేమెంట్ చేస్తే చాలు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Zee5

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు