Home /News /business /

YOUTUBE SHORTS GOOD NEWS FOR CONTENT CREATORS YOUTUBE TESTING ADS ON SHORT VIDEOS GH VB

YouTube Shorts: కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. షార్ట్ వీడియోస్‌పై యాడ్స్ టెస్ట్ చేస్తున్న యూట్యూబ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

షార్ట్ వీడియోలపై యాప్-ఇన్‌స్టాల్ యాడ్స్, ఇతర ప్రమోషన్లతో యూట్యూబ్ యాడ్స్ టెస్టింగ్ స్టార్ట్ చేసిందని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ మంగళవారం తెలిపారు.

ప్రముఖ ఆన్‌లైన్ వీడియో(Video) షేరింగ్ ప్లాట్‌‌ఫాం యూట్యూబ్ (YouTube) షార్ట్స్ (Shorts) అనే షార్ట్-ఫామ్ వీడియో ఫీచర్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ షార్ట్స్ ప్లాట్‌‌ఫాం టిక్‌టాక్ లాగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కాలేకపోతోంది. ఈ నేపథ్యంలో దీనిని మరింత పాపులర్ చేసేందుకు యూట్యూబ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ తాజాగా షార్ట్ వీడియోస్ (Short Videos)పై యాడ్స్ టెస్ట్ (Testing Advertisements) చేయడం ప్రారంభించింది. షార్ట్ వీడియోలపై యాప్-ఇన్‌స్టాల్ యాడ్స్, ఇతర ప్రమోషన్లతో యూట్యూబ్ యాడ్స్ టెస్టింగ్ స్టార్ట్ చేసిందని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ మంగళవారం తెలిపారు. యాడ్స్ వల్ల రెవెన్యూ వస్తుంది కాబట్టి ఎక్కువ మంది యూట్యూబ్ షార్ట్స్‌లో బెస్ట్ క్వాలిటీ షార్ట్ వీడియోలు క్రియేట్ చేసే అవకాశం పెరుగుతుంది. దీంతో షార్ట్స్ ప్లాట్‌‌ఫాం ప్రత్యర్థి యాప్స్ కంటే పాపులర్ అవుతుందని యూట్యూబ్ భావిస్తోంది.

యూట్యూబ్ కంపెనీ షార్ట్ వీడియోలపై యాప్-ఇన్‌స్టాల్ యాడ్స్, వీడియో యాక్షన్ క్యాంపెయిన్లను పరీక్షిస్తోందని ఏప్రిల్ 26న ఆల్ఫాబెట్ ఎర్నింగ్స్ (Alphabet's Earnings) కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ చెప్పారు. "ఇది ఇంకా తొలి రోజులలో ఉన్నప్పటికీ, ఇనీషియల్ ప్రకటనదారుల ఫీడ్ బ్యాక్ ద్వారా మేం దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు అడుగు వేస్తున్నాం," అని అతను చెప్పారు. యూట్యూబ్ సంస్థ షార్ట్స్‌ను సెప్టెంబర్ 2020లో ఇండియాలో మొదటగా పరిచయం చేసింది. 2021లో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా వంటి ఇతర మార్కెట్‌లకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత గత ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది.

Software Employees: కీలక నిర్ణయం తీసుకున్న ఆ ఐటీ దిగ్గజం.. వారంలో మూడు రోజులు ఆఫీసులకు రావాలంటూ..


ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు ఇప్పుడు సగటున 30 బిలియన్ల డైలీ వ్యూస్ పొందుతున్నాయని, ఇది గతేడాది కంటే నాలుగు రెట్లు వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. "మేం ముందుగా గ్రేట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ క్రియేట్ చేయడంపై దృష్టి పెడతాం. కాలక్రమేణా మానిటైజేషన్‌ను రూపొందించడానికి మేం కృషి చేస్తాం" అని పిచాయ్ చెప్పారు. 2022 ఏడాదికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను వివరిస్తూనే, క్రియేటర్లు షార్ట్స్‌లో డబ్బు సంపాదించగల వివిధ మార్గాలను పరీక్షించాలని యోచిస్తున్నట్లు ఫిబ్రవరి 2022లో యూట్యూబ్ పేర్కొంది.

2021-2022 కాలంలో ఒరిజినల్ కంటెంట్‌ను డెవలప్ చేస్తున్న టాప్ షార్ట్ క్రియేటర్లకు రివార్డ్స్ ఇవ్వడానికి యూట్యూబ్ గతేడాది మేలో 100 మిలియన్ డాలర్ల షార్ట్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. 2021లో ఈ ఫండ్ నుంచి డబ్బు పొందిన 40 శాతం మంది క్రియేటర్లు కంపెనీ మానిటైజేషన్ ప్రోగ్రామ్ యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగం కాదని ఈ ఏడాది జనవరిలో యూట్యూబ్ సీఈఓ సుసాన్ వోజ్కికీ తెలిపారు.

చిన్న వీడియోల వ్యూస్ సంఖ్య ప్లాట్‌ఫామ్‌లో మొత్తం వ్యూస్ టైమ్ శాతంగా పెరుగుతుండటంతో షార్ట్స్ వీడియోలను మోనటైజ్ చేయడం కీలకంగా మారింది. షార్ట్స్ వ్యూస్ సంఖ్య పెరగడం వల్ల ఆదాయ వృద్ధి పెరుగుతుందని షిండ్లర్ అభిప్రాయపడ్డారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్ చిన్న వీడియోలపై ఇలాంటి టెస్ట్స్ నిర్వహిస్తున్న సమయంలోనే యూట్యూబ్ కూడా యాడ్స్ టెస్ట్ చేయడం ప్రారంభించింది. "షార్ట్స్‌తో డబ్బు ఆర్జించడం, షార్ట్ వీడియోల చేసే క్రియేటర్లకు రివార్డ్ ఇవ్వడం అంటే ఏంటో మేం తాజాగా పరిశీలిస్తున్నాం. భవిష్యత్తులో మానిటైజేషన్ ఎలా ఉండాలనే దానిపై మేం చాలా చురుకుగా పని చేస్తున్నాం," అని షిండ్లర్ పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Video sharing, Viral, Youtube, Youtube channel

తదుపరి వార్తలు