Youtube News | ఉద్యోగం వదిలేసి యూట్యూబర్లుగా మారిన వారిని మనం చూస్తూనే ఉంటాం. దీనికి ముఖ్యమైన కారణం ఒక్కటే. సంపాదన. యూట్యూబ్ (Youtube) ద్వారా మంచి రాబడి (Money) వస్తుండటంతో యూట్యూబర్లు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇందులో సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2021లో యూట్యూబ్ క్రియేటర్లు దేశ జీడీపీకి ఏకంగా రూ. 10 వేల కోట్లు అందించారు. ఇది 7.5 లక్షల ఉద్యోగాలకు సమానంగా చెప్పుకోవచ్చు. ఎక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అంటే యూట్యూబ్ ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు. తమ ఫ్యాషన్‌ను ఉపాధిగా మార్చుకుంటున్నారు. దీనికి ఈ గణాంకాలే సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. యూట్యూబ్ సౌత్ ఈస్ట్ ఆసియా డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. యూట్యూబ్ క్రియేటివ్ ఎకో సిస్టమ్ ద్వారా ఇండియా క్రియేటర్ ఎకానమీ బలోపేతం అయ్యిందన్నారు. కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరిగిందని తెలిపారు.
ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు లాభాలు ఎలా వస్తాయి? ఈ విషయం మీకు తెలుసా?
అలాగే గూగుల్ కూడా కొత్త ఫీచర్లు తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. చాలా భాషల్లో వాయిస్ సెర్చ్, టైపింగ్ వర్డ్స్ రూపంలో ఇంటర్నెట్ సెర్చ్ ఫెసిలిటీ తీసువస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇండియాకు వచ్చిన సుందర్ పిచాయ్ తన బ్లాగ్‌లో ఈ విషయాలను వెల్లడించారు. దేశంలో టెక్నాలజీ గణనీయంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గూగుల్ కూడా స్టార్టప్స్, స్మాల్ కంపెనీలకు చేయూత అందిస్తుందని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, స్కిల్ ట్రైనింగ్ వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వివరించారు.
300 కిలోమీటర్ల రేంజ్.. బుల్లెట్ బైక్ డిజైన్‌తో అదరగొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్!
కాగా రానున్న కాలంలో యూజర్లకు యూట్యూబ్ కోర్లులు కూడా అందుబాటులోకి రానున్నాయి. సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ కోర్సులు తీసువచ్చేందుకు యూట్యూబ్ రెడీ అవుతోంది. దీని కోసం కంపెనీ పలు సంస్థలతో, క్రియేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. 2023 తొలి అర్ధ భాగంలో ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. భారత్, అమెరికా, దక్షిణ కొరియాలో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇషాన్ జాన్ చటర్జీ తెలిపారు.
డిజిటల్ లెర్నింగ్ విభాగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా కంటెంట్ క్రియేటర్లు ఇంకా చాలా మానిటైజేషన్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువస్తామని, కోర్సులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. కోర్సుల ద్వారా మానిటైజేషన్ బెనిఫిట్స్ పొందొచ్చని పేర్కొన్నారు. అలాగే వివిధ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. అంటే ఒక వీడియోను వివిధ భాషల్లో చూడొచ్చు. నచ్చిన లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. దీని కోసం ఆడియో ట్రాక్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి రాబోతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Money, Youtube, Youtube channel, Youtuber