Home /News /business /

YOUTUBE CHANNELS THE CENTER THAT BLOCKED 16 OTHER YOUTUBE CHANNELS ADVERTISING THAT HATEFUL FAKE NEWS IS SPREADING GH VB

Youtube Channels Block: మరో 16 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంపై దుష్ప్రచారం చేస్తున్న 16 యూట్యూబ్ ఛానళ్లను (YouTube Channels) కేంద్రం తాజాగా బ్లాక్ చేసింది. భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని (Fake Information) వ్యాప్తి చేసినందుకు వీటిని బ్లాక్ చేసింది.

ఇంకా చదవండి ...
భారతదేశంపై దుష్ప్రచారం చేస్తున్న 16 యూట్యూబ్ ఛానళ్లను (YouTube Channels) కేంద్రం తాజాగా బ్లాక్ చేసింది. భారత జాతీయ భద్రత(National Security), విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు(Public Order) సంబంధించి తప్పుడు సమాచారాన్ని (Fake Information) వ్యాప్తి చేసినందుకు వీటిని బ్లాక్(Block) చేసింది. ఈ ఛానెళ్లలో పాకిస్థాన్ (Pakistan) నుంచి పనిచేసే ఆరు యూట్యూబ్ ఛానెళ్లు(6 YouTube Channels) కూడా ఉన్నాయి. ఒక ఫేస్‌బుక్ అకౌంట్(Facebook Account) సహా 16 యూట్యూబ్ ఛానెళ్లను కేంద్రం సోమవారం బ్లాక్ చేసింది. బ్లాక్ అయిన ఈ యూట్యూబ్ ఛానెళ్లు, ఫేస్‌బుక్(Facebook) అకౌంట్​ల మొత్తం వ్యూయర్ షిప్ కలిపితే 68 కోట్లకు పైగా ఉంది. "ఈ యూట్యూబ్ ఛానెళ్లు, ఫేస్‌బుక్ అకౌంట్ భయాందోళనలు సృష్టించడానికి, మత సామరస్యాన్ని రెచ్చగొట్టడానికి, భారతదేశంలో ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి తప్పుడు, అన్‌వెరిఫైడ్‌ ఇన్ఫర్మేషన్ వ్యాప్తి చేస్తున్నాయి" అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting) విడుదల చేసిన ప్రకటన తెలిపింది. "ఐటీ రూల్స్, 2021లోని రూల్ 18 ప్రకారం డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు ఎవరూ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందించలేదు" అని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Astro Vastu Tips: ఈ ఒక్కటీ మీ ఇంట్లో ఉంటే.. డబ్బు కష్టాలు దూరం.. వాస్తు దోష నివారణ కూడా..


బ్లాక్ చేసిన కొన్ని ఇండియన్-బేస్డ్ యూట్యూబ్ ఛానెళ్లు ప్రచురించిన కంటెంట్ అనేది నిర్దిష్ట కమ్యూనిటీ సభ్యులను ఉగ్రవాదులుగా పేర్కొందని.. ఈ కంటెంట్ వివిధ మత వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. "ఈ కంటెంట్ మత సామరస్యాన్ని దెబ్బతీసి, ప్రజా శాంతికి భంగం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలుసుకున్నాం" అని అది పేర్కొంది. ఇండియాలోని అనేక యూట్యూబ్ ఛానెళ్లు సమాజంలోని వివిధ వర్గాలలో భయాందోళనలను రేకెత్తించే అవకాశం ఉన్న అన్‌వెరిఫైడ్‌ వార్తలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

"ఈ ఛానళ్లు షేర్ చేసిన కంటెంట్​లో కరోనా కారణంగా పాన్-ఇండియా లాక్‌డౌన్ ప్రకటనకు సంబంధించిన తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. లాక్‌డౌన్ లో వలస కార్మికులను బెదిరించడం లాంటి ఫేక్ న్యూస్ ఉంది. కొన్ని మతపరమైన వర్గాలకు బెదిరింపులకు సంబంధించి కల్పిత ఆరోపణలు ఉన్నాయి. అలాంటి కంటెంట్ దేశంలోని పబ్లిక్ ఆర్డర్‌కు హానికరం." అని మంత్రిత్వ శాఖ చెప్పింది.

మంత్రిత్వ శాఖ ప్రకారం, పాకిస్థాన్ కేంద్రంగా బ్లాక్ అయిన యూట్యూబ్ ఛానెళ్లు ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ నేపథ్యంలో భారత సైన్యం, జమ్ముకశ్మీర్, విదేశీ సంబంధాల వంటి వివిధ విషయాలపై భారతదేశం గురించి తప్పుడు వార్తలను పోస్ట్ చేయడానికి సమన్వయ పద్ధతిలో ఉపయోగించినట్లు తెలిసింది. జాతీయ భద్రత, సార్వభౌమాధికారం.. భారతదేశ సమగ్రత, విదేశీ రాష్ట్రాలతో భారతదేశం.. స్నేహపూర్వక సంబంధాల కోణం నుంచి ఈ ఛానెల్‌ల కంటెంట్ పూర్తిగా అబద్ధమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Business Idea: రూ.50వేలతో ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్.. నెలకు రూ.1.5 లక్షల సంపాదన..


మంత్రిత్వ శాఖ గత వారం ప్రైవేట్ టెలివిజన్ న్యూస్ ఛానెళ్లకు ఒక సలహా జారీ చేసింది, తప్పుడు వాదనలు చేయడం, కించపరిచేలా ఉన్న హెడ్‌లైన్‌లను ఉపయోగించకుండా వారిని హెచ్చరించింది. బ్లాక్డ్ యూట్యూబ్ ఛానెళ్లలో MRF TV LIVE, సైనీ ఎడ్యుకేషన్ రీసెర్చ్, తహఫుజ్-ఇ-దీన్ ఇండియా, SBB న్యూస్ ఉన్నాయి. పాకిస్థాన్‌లో ఉన్న ఛానెళ్లలో అజ్‌తక్ పాకిస్థాన్, డిస్కవర్ పాయింట్, రియాలిటీ చెక్స్, ది వాయిస్ ఆఫ్ ఆసియా ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Fake news, India, Youtube

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు