హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance Maturity Amount: లైఫ్‌ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అమౌంట్‌పై ట్యాక్స్ చెల్లించాలా..? రూల్స్ ఇవే..

Insurance Maturity Amount: లైఫ్‌ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అమౌంట్‌పై ట్యాక్స్ చెల్లించాలా..? రూల్స్ ఇవే..

Insurance Maturity Amount: లైఫ్‌ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అమౌంట్‌పై ట్యాక్స్ చెల్లించాలా..? రూల్స్ ఇవే..

Insurance Maturity Amount: లైఫ్‌ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అమౌంట్‌పై ట్యాక్స్ చెల్లించాలా..? రూల్స్ ఇవే..

Insurance Maturity Amount: లైఫ్‌ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ తర్వాత అందే మొత్తంపై పన్ను విధించరని చాలామంది భావిస్తుంటారు. అయితే కొన్ని నిబంధనలను మీరితే తప్పక పన్ను చెల్లించాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న చాలా లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) పాలసీలు మెచ్యూరిటీ బెనిఫిట్‌తో వస్తాయి. అంటే టర్మ్ పాలసీల (Term Polices) మాదిరిగా కాకుండా, నిర్ణీత గడువు తర్వాత కొంత మొత్తం పాలసీదారులకు అందుతుంది. ఇలాంటి పాలసీల మెచ్యూరిటీ తర్వాత అందే మొత్తంపై పన్ను విధించరని చాలామంది భావిస్తుంటారు. అయితే కొన్ని నిబంధనలను మీరితే తప్పక పన్ను చెల్లించాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఏ పాలసీల కింద అందే బెనిఫిట్స్‌పై పన్ను చెల్లించాలి, నిబంధనలు ఏంటనేవి చూద్దాం.

* మినహాయింపునకు పరిమితులు

పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం సెక్షన్ 80C కింద ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిడక్షన్‌ ప్రయోజనాలు పొందుతారు. సెక్షన్ 80C కింద ఇన్సూరెన్స్‌ ప్రీమియం(Insurance Premium)పై కూడా డిడక్షన్‌ పొందే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10(10D) ఆధారంగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ మెచ్యూరిటీ తర్వాత అందే మొత్తంపై పన్ను విధిస్తారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ మెచ్యూరిటీ తర్వాత అందే మొత్తం ప్రతి సందర్భంలోనూ పన్ను విధించరని భావించకూడదు. కొన్ని నిబంధనల కింద పాలసీ మెచ్యూరిటీ తర్వాత అందే మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి.

* సెక్షన్ 10(10)D రూల్స్

ఎండోమెంట్, మనీ-బ్యాక్ ప్లాన్‌, యులిప్‌లు లేదా యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల మెచ్యూరిటీపై సర్వైవల్‌ బెనిఫిట్స్‌ అందుతాయి. ఇవి మాత్రమే ఇన్సూరెన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లు. ఇవి పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత డబ్బును అందిస్తాయి. ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఎటువంటి మెచ్యూరిటీ లేదా సర్వైవల్ బెనిఫిట్స్ లేవు. డెత్ బెనిఫిట్స్, మెచ్యూరిటీ బెనిఫిట్స్ మధ్య తేడా ఉంది. మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. డెత్‌ బెనిఫిట్స్‌పై పన్ను వర్తించదు.

* సెక్షన్ 10(10)డి ఏం చెబుతోంది?

కొనుగోలు చేసిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కింద అందే మొత్తంలో పది శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక ఏడాది కాలంలో ప్రీమియంల ద్వారా చెల్లించి ఉంటే పన్ను విధిస్తారు. ఈ సందర్భంలో మెచ్యూరిటీ బెనిఫిట్స్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ 10 శాతం నియమం 2012 ఏప్రిల్ తర్వాత కొనుగోలు చేసిన పాలసీలకు వర్తిస్తుంది. అంతకు ముందు కొనుగోలు చేసిన వాటికి, రూల్ థ్రెషోల్డ్ మొత్తం హామీ మొత్తంలో 20 శాతంగా ఉంది.

సాధారణంగా మెచ్యూరిటీ మొత్తం అనేది హామీ మొత్తం, సంవత్సరాలలో ఆర్జించిన బోనస్‌లతో కలిపి ఉంటుంది. ఈ పూర్తి మెచ్యూరిటీ చెల్లింపులో 10 శాతం కంటే వార్షిక ప్రీమియం చెల్లింపులు ఉంటే పన్ను చెల్లించాలి.ఇది హామీ మొత్తంలో 10 శాతమా లేదా మెచ్యూరిటీ మొత్తంలోనా అనేదానిపై కొందరికి సందేహాలు ఉన్నాయి. హామీ మొత్తంలో 10 శాతం మాత్రమే అని తెలుసుకోవాలి. ఇక్కడ 10 శాతం నిబంధనను ఉల్లంఘిస్తే మొత్తం మెచ్యూరిటీ అమౌంట్‌పై పన్నులు చెల్లించాలి.

ఇది కూడా చదవండి : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ సర్వీస్ ద్వారా మీ సమస్యలు తీరినట్టే..!

* యులిప్ రూల్స్ ఎలా ఉంటాయి?

HNIలు లేదా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు పన్నులను తప్పించుకోవడానికి తరచుగా ఉపయోగించే ULIPల పన్నును హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. మెచ్యూరిటీ మొత్తానికి పన్ను మినహాయింపును అనుమతించే సెక్షన్ 10(10D) వార్షిక ప్రీమియం హామీ మొత్తంలో 10 శాతం కంటే తక్కువగా ఉన్నంత వరకు ULIPలకు వర్తిస్తుంది.

* రూ.2.5 లక్షలు దాటితే పన్ను చెల్లించాలి

2021 బడ్జెట్ సంవత్సరంలో ప్రీమియం మొత్తం రూ.2.5 లక్షలు దాటితే పన్ను రహితమనే నియమాన్ని ఉపసంహరించుకుంది. అటువంటి పాలసీలకు మెచ్యూరిటీపై వచ్చే లాభాలను మూలధన లాభాలుగా పరిగణిస్తారు. సెక్షన్ 112A కింద పన్ను విధిస్తారు. ULIP మెచ్యూరిటీ రాబడిపై మ్యూచువల్ ఫండ్స్ లాగా పన్ను విధిస్తారు. అధిక-ప్రీమియం యులిప్‌లపై వచ్చే ఏదైనా మూలధన లాభాలు ఇతర ఈక్విటీ-ఆధారిత పెట్టుబడులతో సమానంగా రిడెంప్షన్ లేదా మెచ్యూరిటీ సమయంలో స్వల్పకాలిక మూలధన లాభాలు(STCG), దీర్ఘకాలిక మూలధన లాభాల(LTCG) పన్ను కిందకు వస్తాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Income tax, Insurance, Life Insurance, Personal Finance

ఉత్తమ కథలు